Nayan & Vignesh marriage : నయనతార, విగ్నేష్ శివన్ ల పెళ్లి ఈరోజు తెల్లవారు జామున 2:22 గంటలకు అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. వివాహం మహాబలిపురం లోని రిసార్ట్స్ లో చాలా గ్రాండ్ గా బంధువుల సమక్షంలో చేసుకున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఇక పెళ్ళికి తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్, అజిత్, డైరెక్టర్ అట్లీ, హీరో కార్తీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా వీరి పెళ్లికి హాజయారయ్యారు.

పెళ్ళిలో 20,000 మంది పిల్లకు భోజనం…..
ఇక షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో సినిమాలో నయనతార హీరోయిన్ అంటూ ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇపుడు ఈ వార్తలు మరింత జోరందుకుంటున్నాయి. పెళ్ళికి వచ్చిన అతిధులకు పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం ఉండటం సెలబ్రిటీల పెళ్లిళ్లలో మాములే.
On a scale of 10…
— Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022
She’s Nayan & am the One ☝️☺️????????
With God’s grace , the universe , all the blessings of our parents & best of friends
Jus married #Nayanthara ☺️???????? #WikkiNayan #wikkinayanwedding pic.twitter.com/C7ySe17i8F
#WikkiNayanWedding Attendees…
— Christopher Kanagaraj (@Chrissuccess) June 9, 2022
Superstar, Karthi, SRK, Atlee, SJ Suriya, Sarathkumar, Vijay Sethupathy.
Lunch has been arranged for 20,000 Kids.
కానీ నయనతార, విగ్నేష్ శివన్ లు మాత్రం వారి పెళ్ళిలో 20,000 మంది చిన్నారులకు విందు భోజనం ఏర్పాటు చేసారు. ఇక వీరి పెళ్ళికి సంబంధించిన తొలి ఫోటోను విగ్నేష్ తన ఆఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నా నయన్ మరియు నేను అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక ఇపుడు ఈ ఫోటో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు పెళ్ళికి వచ్చిన సెలబ్రిటీల వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.
































