Nayana Tara marriage rumours : నయన తార కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్. తన కెరీర్ కంటే తాను వ్యక్తిగతంగానే ఒడిదుడుకులను ఎదుర్కొంది. రెండు సార్లు ప్రేమలో విఫలమైంది నయన తార. ఒకసారి శింబుతో పీకల్లోతూ ప్రేమలో మునిగిన నయన్ ఆ తరువాత మళ్ళీ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి పెళ్లి దాకా వెళ్ళింది. ఇక ఆ రెండు ప్రేమయణాలు విఫలమవడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నయన తార డిప్రెషన్ నుండి కోలుకొని మళ్ళీ తిరిగి హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఎన్నో కష్టాలను చూసిన నయన తార ఇపుడు మళ్ళీ విగ్నేష్ శివన్ అనే దర్శకుడితో ప్రేమలో పడింది.

పెళ్లిపీటలెక్కనున్న జంట…
ఇక విగ్నేష్ శివన్ నయన తార వాళ్లిదరు ప్రేమించుకుంటున్నట్లు చెప్పకనే చెప్పారు. విదేశీ విహారాలకు వెళుతూ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేసారు. ఇక ఇటీవలే విగ్నేష్ దర్శకత్వంలో కన్మని రాంబో ఖాతిజ సినిమాలో విజయ్ సేతుపతి, సమంతలతో పాటు నటించిన నయన తార ఇక పెళ్లి పీటలెక్కనుంది. జూన్ 9న ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. అయితే పెళ్లి తిరుపతి లో జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తిరుపతి లోనే ఎందుకు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Congratulations to the beautiful couple of Tamil film industry @VigneshShivN nd #Nayanthara who are getting married on 9th might be in Tirumala Tirupathi ????❤????????
— Sam❤Anu (@samzcraziestfan) May 7, 2022
All the best for your future sending lots of success nd happiness to both of you ????✨????#KaathuVaakulaRenduKadhal pic.twitter.com/unt4FFyz0I
నయన తార తన జీవితంలో రెండు సార్లు ప్రేమా పెళ్లి విషయంలో విఫలమైంది. అందుకే ఈ కొత్త బంధం దృడంగా ఉంటూ ఏ ఆటంకాలు రాకూడదని పవిత్రమైన వెంకన్న సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తోందట. అంతే కాకా దాదాపు ఏడేళ్లుగా విగ్నేష్ శివన్, నయన తార ప్రేమలో ఉన్నారు ఇది కూడా ఏడుకొండల వాడి సన్నిధిలో పెళ్ళికి మరో కారణంగా చెబుతున్నారు. మొత్తానికి నయన తార లేటుగా అయిన పెళ్లి చేసుకోబోతోంది ఇక ఈ బంధంలో అయిన తాను హ్యాపీ గా ఉంటుందేమో చూడాలి.






























