Nayanatara : మొత్తానికి ప్రేమ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రేమ పుకార్లు మొదలైనప్పటి నుండి నయన్, విగ్నేష్ లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎదురుచూశారు. చివరికి మూడుముళ్ల బంధంలో ఇద్దరు అడుగుబెట్టబోతున్నారు. జూన్ 9 న మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నారు. నయనతార రెండు ప్రేమ వైఫల్యాల తరువాత చివరికి ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోబోతుంది.

పెళ్ళికి డ్రెస్ కోడ్….
విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార పలు సినిమాల్లో నటించింది. తాజాగా కాతూ వాకుల రెండు కాదల్ సినిమాలో కూడా నటించింది. వీళ్లిదరు ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొన్ని నెలలుగా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు బాగా వచ్చాయి. విగ్నేష్ ఈ వార్తలకు సమాదానంగా వారి పెళ్లి గురించి చెప్పి క్లారిటీ ఇచ్చేసాడు మహాబలిపురంలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రిక కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అందులో ఉన్న మరో ఆసక్తికర విషయం డ్రెస్ కోడ్.

పెళ్ళికి హాజరయ్యే అతిధులందరు ఎత్నిక్ పాస్టల్స్ డ్రెస్ కోడ్ ను పాటించాలని అందులో వుంది. ఇద్దరికి సంబంధించిన దగ్గరి బంధువులు, స్నేహితులే కాబట్టి వేడుకలో వారిని భాగం చేసేందుకు ఇలా డ్రెస్ కోడ్ పెట్టారని భావిస్తున్నారు. ఇక వీరి పెళ్లి మహాబలిపురం లోని షేరటన్ గ్రాండ్ లో ఉదయం 8:30 కు జరగనుంది. ఈ పెళ్లి ని నెట్ ఫ్లిక్స్ ఇండియా లైవ్ స్ట్రీమింగ్ లో చూడొచ్చు.






























