సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ నయనతార. ఓవర్ నైట్ లో ఈమెకు ఈ స్టార్ డం రాలేదు. తన ప్రతిభతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది ఆవిడ. కమర్షియల్ సినిమాలలో గ్లామర్ మెరుపులు మెరిపించినా, లేక చీరకట్టులో పద్ధతిగా కనిపించిన, లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన అది సౌత్ ఇండియాలో నయనతారకు మాత్రం సరిగ్గా సరిపోతుంది.

అసలు స్టార్ హీరోల సినిమాల తరహాలోనే నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు డబ్బుల వర్షం కురిపించాయి. 35 ఏళ్ళ వయసులో కూడా నయనతార వన్నె తరగని అందంతో కొనసాగుతుంది. తన జీవితంలో ఎన్ని విమర్శలు ఎదురైనా నయనతార తన దారిలో తను పయనిస్తూనే ముందుకు వెళుతుంది. ఇక పోతే తన నిజజీవితంలో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక 2 ఫెయిల్యూర్ లవ్ స్టోరీలను నయనతార అనుభవించడం జరిగింది. నటుడు ప్రభుదేవా, తమిళ నటుడు శింబుతో గతంలో నయనతార ప్రేమలో పడి లవ్ ఫెయిల్యూర్ చవిచూసింది. అయితే నటుడు ప్రభుదేవా తో పెళ్లి చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్న కూడా చివరికి ప్రభుదేవా మొదటి భార్య వల్ల వారు పెళ్లి చేసుకోకుండా విడిపోవడం జరిగింది.

ఇక మరో లవ్ స్టోరీ తమిళ నటుడు శింబుతో జరిగింది. నిజంగా శింబూ ఒక ప్లే బాయ్. ఆయనతో సినిమా చేసే హీరోయిన్ల విషయంలో ఎప్పుడు పార్టీలు, వారితో సరదాగా ఉండటం ఇలా చేస్తూ ఉంటాడు. అయితే శింబు – నయనతార విషయంలో కాస్త చొరవ ఎక్కువ తీసుకొని ముందుకు నడిచారు. కాకపోతే ఈ విషయంలో నటుడు శింబు తండ్రి ఒప్పుకోకపోవడంతో వారి పెళ్లి కూడా పెళ్లి పెటాకులు అయింది. దీనితో నయనతార 2 లవ్ ఫెయిల్యూర్ లను మోయాల్సి వచ్చింది.

అయితే ఒకసారి ఆవిడ మాట్లాడుతూ… నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు… నమ్మకం లేకుండా కలిసి ఉండటం కంటే విడిపోవడమే బెటర్ అని తెలిపింది. నిజానికి ప్రభుదేవా, శింబుతో విడిపోవడానికి కారణం అదేనని ఆ సమయంలో నేను ఎంతో వేదన అనుభవించానో నాకు మాత్రమే తెలుసు అని తెలిపింది. అయితే ఈ విషయంలో మీడియా నేను నోరు మెదపక పోవటంతో వారికి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు అని కూడా ఆవిడ మాట్లాడారు.ఇక శింబు తో విడిపోయి ప్రభుదేవాతో కొన్నాళ్ళు ప్రేమాయణం బాగానే సాగిన ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రభుదేవా పెట్టిన కండిషన్స్ తో నయన్ ఈ ప్రేమకు కూడా స్వస్తి చెప్పింది. మొదటగా క్రిష్టియన్ గా ఉన్న నయన్ ప్రభుదేవా కండిషన్ వల్లనే హిందువుగా మారిందట ..ఆ తర్వాత రాను రాను ప్రభు దేవా ఆధిపత్యం మరియు షరతుల వల్ల ఆ బంధం కూడా బీటలు వారింది



























