“అందుకే ఆ ఇద్దరినీ వదిలేసా…” తన లవ్ ఫెయిల్యూర్స్ పై స్పందించిన నయనతార..!

0
633

దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోయిన్… లేడీ సూపర్ స్టార్ నయనతార. 15 ఏళ్ల సినిమా కెరీర్… నటించిన అన్ని భాషల్లోను టాప్ స్టార్స్ సరసన నటించింది. చీర కట్టులో ఎంత ముద్దుగా ఉంటుందో… బికినీలో కూడా అంతే వయ్యారం వెలబోయడం కేవలం నయనతారకి మాత్రమే చెల్లింది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ హిట్లు అందుకుంది. ఎటువంటి పాత్రలోకి అయినా పరకాయ ప్రవేశం చేయగలిగే అతి కొద్దిమంది హీరోయిన్లలో నయనతార మొదటి వరుసలో ఉంటారు.

అయితే ఇదంతా తెరముందే.. తెరవెనుక నయనతార జీవితమంతా ఒడిడుకుల మాయం. నయనతార తన కెరీర్ ఆరంభం నుంచే ప్రేమ వ్యవహారాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచింది. ఇప్పటికే ఇద్దరు హీరోలకు బ్రేక్ అప్ చెప్పింది. అయితే ఇప్పుడు తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించింది.

“నా జీవితంలో రెండు సార్లు ప్రేమ విఫలం కావడానికి కారణం నమ్మకం నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. నమ్మకం లేకుండా జీవిచడం కన్నా విడిపోవడమే మంచిదనే అభిప్రాయంతో వారితో నా బంధాన్ని వదులుకున్నాను. వాళ్లతో నా అనుబంధాన్ని వదులుకున్నాక నేను ఎంత క్షోభను అనుభవించానో ఆ దేవుడికే తెలుసు” అంటూ వ్యాఖానించారు. ఆ సమయంలో తాను ఏంతో బాధను అనుభవించానని, ఆ బాధనుంచి బయటకి రావడానికి తనకు చాలా కాలమే పట్టిందని, సినిమాలే తనను తిరిగి మెమోలు మనిషిని చేశాయని చెప్పింది. నా అభిమానులు ఎప్పుడు నావెంటే ఉన్నారు. ఇక జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా సినిమాలను మాత్రం వదలమని చెప్పుకొచ్చింది నయనతార.

అయితే గత ఐదేళ్లుగా ఆమె యుంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపిస్తుందని తెలిసిందే. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచరం.