Nayanathara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు.ఇలా ఏడు సంవత్సరాలు పాటు ప్రేమ పక్షులు గా విహరించిన ఈ జంట ఎట్టకేలకు మహాబలిపురంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇక వీరి వివాహానికి నయనతార కో స్టార్స్ అందరూ కూడా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు దర్శకనిర్మాతలు తన వివాహానికి హాజరైనట్టు తెలుస్తోంది. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నటుడు షారుక్ ఖాన్ ఈ వివాహానికి హాజరయ్యారు.అయితే నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను తన పెళ్ళికి దూరం పెట్టారని తెలుస్తోంది.

నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోల సరసన నటించారు.ఇలా టాలీవుడ్ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకున్న నయనతారకు టాలీవుడ్ సెలబ్రిటీలు కనిపించలేదా అందుకే వారిని తమ పెళ్లికి ఆహ్వానించలేదని ఈమెపై పలువురు విమర్శలు చేస్తున్నారు.నయనతార కేవలం సమంత మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే తన పెళ్ళికి ఆహ్వానించారని తెలుస్తోంది.
రిసెప్షన్ కు భారీగా తరలి రానున్న సెలబ్రిటీలు…
ఈ విధంగా నయనతార టాలీవుడ్ సెలబ్రిటీల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె సన్నిహితులు స్పందించారు.ఈ సందర్భంగా నయనతార సన్నిహితులు మాట్లాడుతూ నయనతార తన పెళ్ళికి కేవలం కొంతమందికి మాత్రమే ఆహ్వానించారని అందుకే టాలీవుడ్ సెలబ్రిటీలను తన వివాహానికి ఆహ్వానించలేక లేకపోయారని తెలిపారు.అయితే తన రిసెప్షన్ కి మాత్రం పెద్ద ఎత్తున సెలబ్రిటీలందరిని ఆహ్వానించారని రిసెప్షన్ లో ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మరి ఈమె వివాహ రిసెప్షన్ కి ఏఏ సెలబ్రిటీలు హాజరవుతారో తెలియాల్సి ఉంది.





























