Neetu Chandra : నీతు చంద్ర… 2003 లో విష్ణు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తరువాత గోదావరి సినిమాలో నటించి రాజి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. వరుస బాలీవుడ్ సినిమాలు చేస్తూ, రాజశేఖర్ సినిమా అయిన సత్యమేవ జయతే లో కూడా హీరోయిన్ గా నటించింది. మనం సినిమాల్లో కూడా ఎయిర్ హోస్టేస్ పాత్రలో నటించింది. తెలుగులో హీరోయిన్ గా ఆశించిన అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది.

నటన పరంగానే కాకుండా తన తమ్ముడు నితిన్ చంద్ర దర్శకత్వం వహించిన సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే కొంతకాలంగా చెప్పుకోదగ్గ సినిమా అవకాశలు రాక నీతు చంద్ర ఇబ్బంది పడుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నీతు తన పరిస్థితి గురించి, తాను జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
జీతం తీసుకునే భార్యగా…
తాను సినిమాల్లో బిజీ గా వున్న సమయంలో దేశంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త తనకు ఒక ఆఫర్ ఇస్తాను అన్నాడు, మొదట అది సినిమా ఆఫర్ అనుకున్నాను. కానీ ఆయన తనను జీతం తీసుకునే భార్యగా ఉండమని ఆఫర్ ఇచ్చాడు. ఎన్ని నెలలు ఉండగలిగితే అన్ని నెలలు నా భార్యగా ఉండవచ్చు. అందుకు నెలకు పాతిక లక్షల రూపాయలు ఇస్తానని తను నాకు ఆఫర్ ఇచ్చాడని నీతు ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడం కోసం ఒక బాలీవుడ్ కి చెందిన బడా కాస్టింగ్ డైరెక్టర్ తనతో ఒక గంటసేపు ఆడిషన్ చేసి ఇది వర్కౌట్ అవడం లేదు మీకు ఈ ఆఫర్ ఇవ్వడం కుదరదని వెనక్కి పంపించాడు. తర్వాత నాకు అర్థం అయింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను చంపడం కోసమే తాను అలా చేశాడని అని చెప్పింది.

13 మంది జాతీయ అవార్డు గ్రహీతలతో సినిమాలు చేసినాకుడా ప్రస్తుతం తన చేతిలో ఆఫర్లు లేవు, నా దగ్గర డబ్బులు కూడా లేవు అని తన బాధ ను వ్యక్తస్పరిచారు. ఇక ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మాట్లాడుతూ… వ్యక్తులు మరణించాకే వారు చేసిన పనులను గౌరవిస్తారని అనిపించడంతో తాను కూడా కొన్నిసార్లు చనిపోవాలి అన్న ఆలోచన వచ్చినట్లు తెలియజేసింది.

































