నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

0
133

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.. మరో ఆరుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రలను స్థానికులు ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మర్రిపాడు మండలం బుదవాడ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితులు కడప జిల్లా గోపవరం మండలం బెడుసునపల్లె కు సంబంధించిన వారుగా పోలీసులు గుర్తించారు. నడిపాడులోని జామాయిలు కర్రలు కొట్టేందు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here