Singer Sunitha : గాయనిగా తనకంటూ గుర్తింపుతో దూసుకుపోతున్న సునీత తన అందంతో కూడా అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని తన అందం, అందమైన గాత్రంతో అందరిని అలరిస్తోంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత విడాకులు తీసుకుని సింగల్ విమెన్ గా ఇద్దరు పిల్లలను పెంచుతూ అందరికి ఆదర్శంగా కూడా నిలిచింది. ఇక రీసెంట్ గా మళ్ళీ పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది . మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని తో వివాహం తర్వాత మరింత రెట్టించిన ఉత్సాహంతో కెరీర్ లో దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సునీత ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. తన ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేస్తూ, ఇక ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంటారు. ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు సునీత. మునుపటి కంటే ఇంకా అందంగా, తాజా లుక్ లో చాలా బాగున్నారు. ఇక ఈ ఫొటోకు చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పారు. అయితే ఒక నెటిజెన్ పెట్టిన కామెంట్ మాత్రం బాగా వైరల్ అయింది. సదరు నెటిజెన్ రజని కుమార్,’మీ లుక్ చాలా బాగుంది’ అంటూ కామెంట్ చేసాడు. ఇదేమీ వింత విషయం కాదు కానీ ఆ కామెంట్ కి కింద రిప్లై గా ‘ ఓ అవునా ‘ అంటూ నవ్వుతున్న ఎమోజి ని షేర్ చేసారు. దీంట్లో ఏముంది అంటారా.. ఆ రిప్లై ఇచ్చిన వారు రజనీ కుమార్ భార్య కావడం విశేషం.

దీంతో ఇక రచ్చ మొదలయింది. ఇక సోషల్. మీడియాలో ఇలాంటి ఇష్యూ ను వదులుతారా అతనిపై ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.ఏంటన్నా ఇలా బుక్ అయిపోయావ్..,ఇప్పుడు రజినీబాబు పరిస్థితి ఏంటో..,మాస్టారూ బతికే ఉన్నారా?..మీపై మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయండీ బాబూ.. నువ్ తగ్గొద్దు అన్నా మీ వెనుక మేం ఉన్నాం.., ఈ రోజు ఇంట్లో ఏమైందో రేపు కామెంట్స్‌లో చెప్పన్నా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ గోల భరించలేక పాపం రజనీ బాబు తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లాక్ చేసేసారు. ఇక సదరు మెసేజ్ కుడా డిలీట్ చేసారు. కానీ ఇంతకీ పాపం ఇంట్లో ఏమి జరిగిందో…



























