ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు సినిమాలే కాకుండా.. సామాజిక బాధ్యత కూడా కాస్త ఎక్కువే. ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అంశంపై స్పందించే హరీష్ తాజాగా శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ వయౌ వృద్ధుడిని చూసి చలించిపోయి.. అతడిని కాపాడే ప్రయత్నంలో భాగంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా “హైదరాబాద్ మలక్ పేట్ దగ్గరలో 70 ఏళ్ల వృద్ధుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని, అత్యవసరంగా అంబులెన్స్ పంపించాలి” అంటూ మలక్ పేట యశోదా ఆసుపత్రి సిబ్బందికి ట్వీట్ పంపించారు.

అయితే ఆయన మంచి ఉద్దేశంతో ఈ పని చేసినా.. ఈయన ట్వీట్ పై వెంకట్ అనే నెటిజన్ స్పందిస్తూ.. ‘బుర్ర ఉంది కదా.. కొంచెం వాడు, ట్వీట్ చేసి టైం వేస్ట్ చేయడం కన్నా అంబులెన్స్ కి నువ్వే కాల్ చేయొచ్చు కదా.. నువ్ ట్వీట్ చేసే లోపు పేషెంట్ ప్రాణాలకు ఏమైనా హానీ జరిగితే.?’ అయితే అంటూ పబ్లిసిటీ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు ఆ నెటిజన్. దీంతో ఖంగుతిన్న హరీష్ “వీడిని అసలు ఏమి అనాలో కూడా అర్ధం కావడం లేదు ఫ్రెండ్స్” అంటూ రిప్లై ఇచ్చారు హరీష్. అయితే చాలా మంది నెటిజన్లు వెంకట్ నే సమర్ధిస్తూ.. ‘హరీష్ శంకర్ ట్వీట్ చేయడమెందుకు.? హాస్పటల్ కి ఫోన్ అయినా చేయాలి.. లేదంటే 108కి కాల్ చేయాలి’ అంటూ లాజిక్‌లు లాగుతున్నారు.
Respected @YashodaHospital malakpet can u send ambulance its emergency near ur area
— Harish Shankar .S (@harish2you) July 12, 2020
70 years guy suffering with breathing problem
మరికొందరైతే హరీష్‌కి మద్దతు ప్రకటిస్తూ.. ఆయన మంచి చేయాలనుకున్నా మీలాంటి వాళ్లు చేయనిచ్చేట్టుగా లేరు.. మలక్ పేటలో సరైన రెస్పాన్స్ లేనందువలనే హరీష్ ట్వీట్ చేసి ఉంటారు’ అంటూ సమర్ధిస్తున్నారు. మొత్తానికి హరీష్ చేసిన ఈ అంబులెన్స్ ట్వీట్ సోషల్ మీడియాలో బాగానే వైరలవుతోంది.
Veedini emi anaalo teleetledhu friends https://t.co/pRZCL59h8K
— Harish Shankar .S (@harish2you) July 12, 2020




























