నువ్వు కూడా సుశాంత్ మరణాన్ని క్యాష్ చేసుకుంటున్నావా దీపికా ? మండిపడుతున్న నేటిజన్లు..!

0
217

ఈ నేపథ్యంలో దీపికా పదుకొనే గడిచిన నాలుగు రోజులుగా ఓకే పోస్ట్ ను ట్విట్టర్లో మళ్లీ మళ్లీ పోస్ట్ చేస్తోంది. డిప్రెషన్ కు సంబంధించిన ఈ పోస్ట్ సుశాంత్ మరణించిన తరువాత నుంచి పోస్ట్ చేస్తుంది. దీని సారాంశం “గతంలో తాను కూడా ఒక సమయంలో డిప్రెషన్ కు లోనయ్యానని.. తాను కూడా తనువు చాలించాలనే ఆలోచనలు కూడా ఎక్కువగా వచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది. అయితే సుశాంత్ ఒక్కడే కాదు చాలామంది మంది కూడా తమ జీవితంలో ఇటువంటి డిప్రెషన్ ఎదురైనప్పుడు చావును వెతుక్కుంటూ వెళుతున్నారని ట్వీట్ చేసింది ఈ అమ్మడు. అయితే అది కరెక్ట్ కాదని.. ఈ సమస్యకు చావు ఎంతమాత్రం పరిష్కారం కాదని దీపికా చెబుతోంది.

ఈ నేపథ్యంలో ప్రతితోజు డిప్రెషన్ కు సంబంధించిన కొన్ని వ్యాఖ్యాలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంది. అయితే ఈమె పెడుతున్న పోస్టులు చూస్తున్న నెటిజన్లు ఆమె పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. “ఒకరోజు.. రెండు రోజలు అయితే ఓకే అంతేగాని ప్రతిరోజు డిప్రెషన్ కు సంబంధించిన కొటేషన్స్ పెడుతూ సుశాంత్ చావును కూడా నువ్వు క్యాష్ చేసుకుంటున్నావా దీపికపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి పోస్ట్ లు చేయడం ఇకనైనా ఆపండి అందు ఆమెను కోరుతున్నారు. కాగా నిజంగానే హిందీ చిత్ర పరిశ్రమలో సుశాంత్ మరణం తరువాత చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన చావును కూడా వీళ్ళు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. సుశాంత్ బతికున్నప్పుడు పట్టించుకోని వాళ్ళు అయన చనిపోయాక మాత్రం మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ చురకలు అంటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here