తనపై తప్పుడు రాతలు రాస్తున్నారంటూ తాజాగా ఒక గాసిప్స్ వెబ్సైట్ పై ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు విజయ్ దేవరకొండ. అదే సమయంలో కిల్ ఫేక్ న్యూస్ అంటూ ఒక ట్యాగ్ ను సోషల్ మీడియాలో వదిలిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా విజయ్ కు అండగా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా.. మహేష్ బాబు, రానా, అల్లరి నరేష్, నాగేంద్ర బాబు, కొరటాల శివ, క్రిష్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వంశి పైడిపల్లి… హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా మొదలుగున వారు విజయ్ దేవరకొండకు ట్విట్టర్ వేదికగా నీతో పాటు మేమున్నాము అంటూ నిలుస్తున్నారు.

అయితే తాజగా ఈ వ్యవహారంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా తనదైన శైలిలో వ్యంగ్యంగా రెస్పాండ్ అయింది. తన ట్విట్టర్ ఖాతాలో రియాక్ట్ అయిన అనసూయ “మన వారకు వస్తే గాని బుద్ధి రాదన్నమాట… మ్…” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది. దీనితో విజయ్ దేవరకొండ ఫాన్స్ తో పాటుగా మహేష్ ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇప్పటికే ఆమె మీద రక రకాల మిమ్స్ మొదలైపోయాయి. రకరకాలుగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయినా నువ్వు నీకేం ఆవసరం నువ్వెందుకు ఈ విషయంలో కలుగజేసుకుంటున్నావ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అసలు నువ్వు కరోనా భాదితులకు విరాళం ఇచ్చావా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మరికొంత మంది అయితే ఇలాంటి కుళ్ళు జోకులు జబర్దస్త్ లో వేసుకో.. అంతేగాని ఇలాంటి విషయాల్లో వేలు పెట్టకు అంటూ గట్టిగ వార్నింగ్ ఇస్తున్నారు.
Manavaraku vaste kaani buddhi raadanna maata .. hmm ????
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 4, 2020




























