కేవలం 10 రోజుల్లో 1500 వందల పడకల ఆసుపత్రి !! రికార్డు సృష్టించబోతున్న తెలంగాణ ప్రభుత్వం !!

0
282

కరోనా ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కరోనా పేరు చెబితే వణికిపోయే పరిస్థితి. దానికి కారణం ఈ మహమ్మారికి ఎటువంటి మెడిసిన్ లేకపోవడమే.. ఈ మహమ్మారిని అంతమొందిచడం కోసం చైనా ఏకంగా 8 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుతం కూడా దానికి మించిన పని చేయబోతుంది. అవసరం అయితే కరోనాను ఎదుర్కొనడానికి ప్రత్యేక ఆసుపత్రిని సైతం నిర్మిస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు నిజం చేయబోతున్నారు.

చైనాను మించేలా కేవలం 10 రోజుల్లోనే 1500 వందల పడకల ఆసుపత్రిని యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ శివార్లలో గచ్చిబౌలిలో ఈ 1500 వందల పడకల ఆసుపత్రిని నిర్మిస్తోంది. ఈ ఆసుపత్రి కోసం వెయ్యి మంది కార్మికులు కస్టపడి పనిచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద కరోనా ఆసుపత్రిని సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆసుపత్రిలో అత్యాధుని సదుపాయాలను సైతం కల్పిస్తున్నారు. స్పోర్ట్స్ అధారిటీ కి సంబంధిచిన ఒక కంప్లెక్స్ ను పూర్తి కరోనా ఆసుపత్రిగా మార్చేస్తున్నారు. 15 అంతస్తులున్న ఈ భవనంలో ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టారు.

ఈ ఆసుపత్రికి కావాల్సిన ఫర్నీచర్, మెడికల్ కిట్స్ మొదలగునవి ఇప్పటికే ఆ ఆసుపత్రికి తరలించారు. ఈ అత్యాధునిక కరోనా ఆసుపత్రిని ఏప్రిల్ 15లోగా పూర్తిచేయాలని చూస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన వెంటనే కరోనా రోగులందరినీ షిఫ్ట్ చేయనున్నారు. వీరందరికి త్వరితగతిన వైద్యం అందించేందుకు ఇప్పటికే 70మంది డాక్టర్లను, 120 మంది నర్సులను మరియు పారా మెడికల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఇటీవలే మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పలువురు ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here