ఇకపై 80 సంవత్సరాలు పైబడిన వారిని విమానాల్లోకి అనుమతి లేదు… మిగిలిన వారు తప్పనిసరిగా…

0
257

కరోనా నేపథ్యంలో దాదాపు 50 రోజుల లాక్ డౌన్ తరువాత మెల్ల మెల్లగా సడలింపులు ఇస్తున్నారు.. ఇప్పటికే రైల్యే శాఖ దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విమానయాన ప్రయాణాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలను రూపొందిస్తున్నట్టు సమాచారం.

ఈ నిబంధనల్లో భాగంగా 80 ఏళ్ళు పైబడిన ఏ ప్రయాణికుడిని విమానాల్లోకి అనుమతించరు. ప్రయాణికుల క్యాబిన్ లగేజికి సంబంధించి కూడా కొన్ని కొత్త నిబంధనలను తీసుకువస్తుంది. ప్రయాణికుల క్యాబిన్ లగేజ్ 20 కేజీలకు మించకుండా ఉండాలని సూచిస్తున్నారు. అది కూడా ఒకే బ్యాగులో కాకుండా రెండు, మూడు బ్యాగులలో ఉండాలని సూచిస్తున్నారు. దీనికి తోడు వ్యక్తిగత దూరం పాటించేలా సీటింగ్ మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులకు మధ్య వీలైనంత దూరం ఉంచేందుకు ప్రత్నిస్తున్నారు.

అంతేకాదు ప్రతి విమాన ప్రయాణికుడు తప్పని సరిగా ఆరోగ్యసేతు యాప్ ఇంస్టాల్ చేసుకోవాలి. ప్రయాణికుడు తప్పని సరిగా తన ఆరోగ్య వివరాలు చెప్పాల్సి ఉంటుంది. గత నెలరోజుల్లో కరోనా చికిత్స తీసుకున్నారా? వంటి వివరాలు తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే అధికారిక ట్యాక్సీలను మాత్రమే విమానాశ్రయాలకు రావాల్సి ఉంటుంది. అందువల్ల రెండుగంటల ముందుగానే ఎయిర్ పోర్ట్ లోనికి అనుమతిస్తారు. ప్రయాణ సమయానికి గంట ముందు మాత్రమే బోర్డింగ్ కు అనుమతిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here