Niharika Divorce: నిహారిక వెంకటచైతన్య 2020 డిసెంబర్ 9వ తేదీ ఎన్నో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నప్పటికీ వీరి పెళ్లి మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన రెండు సంవత్సరాలకి వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఈ విషయం అధికారకంగా వెళ్లడైంది. ఇలా నిహారిక వెంకట చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటే ఎందుకు విడాకుల వరకు వెళ్లారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే నిహారిక వెంకట చైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం నిహారిక వ్యవహార శైలి కారణం అనే వార్తలు వస్తున్నాయి.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి నిహారిక ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనటువంటి ఇంటికి కోడలుగా వెళ్లారు దీంతో ఆమె అక్కడ ఇమడ లేకపోయారని తెలుస్తోంది. దీంతో తిరిగి తన సినిమాలలోకి రావడం పట్ల చైతన్య ఫ్యామిలీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక పెళ్లి తర్వాత కూడా అదే స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేశారు. అంతేకాకుండా తన జిమ్ ట్రైనర్ మీద కూర్చొని నిహారిక వర్కౌట్స్ చేసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి వెంటనే డిలీట్ చేశారు. ఇక ఈ వీడియో అప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

Niharika Divorce: అసహనం వ్యక్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్…
ఇలా ఈ వీడియో కారణంగానే చైతన్య నిహారికమధ్య మనస్పర్ధలు వచ్చాయని ఈ సంఘటన మర్చిపోకముందే మరోసారి రాడిసన్ పబ్ లో పోలీసులకు దొరకడంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు వచ్చాయి. ఆ గొడవలు కారణంగానే విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా నిహారిక ఇలా విడాకులు తీసుకోవడం పట్ల మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.































