నిహారిక ఎంగేజ్మెంట్ వీడియో రిలీజ్ చేసిన నాగబాబు…!! [వీడియో]

0
252

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఈమధ్యనే తనక్కాబోయే వరుడు గురించి సోషల్ మీడియాలో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోబోతున్నారు. చైతన్య ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి ఎప్పట్నుంచో పరిచయం ఉండటంతో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకట రత్నం ప్రాణ మిత్రులు కావడంతో ఈ పెళ్ళి సంబంధం కుదిరినట్టు తెలిసింది.

చైతన్య స్వస్థలం గుంటూరు కాగా.. ఇండియన్ స్కూల్ బిజినెస్‌ లో MBA పూర్తిచేశారు. ప్రస్తుతం చైతన్య హైదరాబాద్‌లోని ఓ MNC కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం. ఇక చైతన్య-నిహారికలకు ముందే పరిచయం ఉండటంతో ఒకర్నొకరు అర్థం చేసుకున్న తరాతే వీళ్ళిద్దరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ టాక్. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి పనులు అప్పుడే మొదలైనట్టు తెలుస్తుంది. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులతో పాటు సాయి ధరమ్ తేజ్ వంటి కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక నిశ్చితార్ధం ఎంతో సింపుల్‌గా జరిగింది.

వేద పండితులు ఈ నిశ్చితార్ధపు తంతును వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా జరిపించారు. 2 కుటుంబాలకు చెందిన పెద్దలు తాంబూలాలు మార్చుకున్నారు. తాంబూలాల తంతు పూర్తి అయ్యింది. కానీ., పెళ్లెప్పుడేదనేది మాత్రం ఇంకా కన్ ఫార్మ్ కాలేదు. వీలైనంత త్వరలోనే అఫీషియల్‌గా నిహారిక పెళ్ళి డేట్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. వచ్చే కార్తీక మాసం లేదా మార్గశిర మాసం అంటే అక్టోబర్, నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయని మెగా ఫ్యామిలీ ఈ సందర్భంగా సూచాయగా తెలియ జేసింది. తాజగా నిహారిక ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వీడియోని విడుదల చేసారు మెగా బ్రదర్ నాగబాబు.

ఆ వీడియో మీకోసం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here