హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న పుడింగ్ అండ్ మింక్ pub లో జరిగిన పోలీసులా దాడులు మెగాస్టార్ ఫ్యామిలీ ని వదిలేలా లేవు. నిహారిక కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పిన నాగబాబు వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చినా ఇష్యూ ఇంకా ముగిసిపోలేదు. ఇక పవన్ రాజకీయ ప్రత్యర్థులకు మంచి ఆయుధం దొరికిందనే చెప్పాలి.

నాగబాబు పై శ్వేత రెడ్డి ఫైర్…
బిజెపి మహిళా నేత యాంకర్ శ్వేత రెడ్డి ఇక మెగాస్టార్ ఫ్యామిలీ పై విరుచుకు పడింది.మెగాస్టార్ చేసిన యాంటీ డ్రగ్స్ ప్రచారం కి సంబంధించిన వీడియో ను చూపిస్తూ . ఇది నీహారికకి చూపించడం మరిచిపోయారో.. లేదంటే ఆమెకు చూడ్డానికి ఖాళీలేదో తెలియదు కానీ.. మెగాస్టార్ మాత్రం చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. ముందు ఈ వీడియోను ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు చూపించాలి. ఆ తరువాత జనానికి చెప్పాల్సింది.
ఇక నాగబాబు ను ఏ మాత్రం వదల్లేదు శ్వేత రెడ్డి. తన కూతురు అమాయకురాలు అంటూ చెప్పే నాగబాబు పెద్ద ఇళ్లలో ఇవన్నీ కామన్.. పోతుంటారు వెళ్తుంటారు.. అర్ధరాత్రి తప్పతాగి రోడ్డు మీద చిందులు వేయడం స్టేషన్‌లకు కామన్ అని అనుకుంటున్నాడో నాకైతే అర్ధం కావడం లేదు. ఎప్పుడూ నిజాలు మాట్లాడే నిఖార్సైన నా లాంటి ఆడవాళ్లపై ఎగేసుకుని పడిపోయే జనసేన తమ్ముళ్లూ.. అన్నలూ ఏం చేస్తారో చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. కాబట్టి ఎదుటివాళ్లు కూడా మన ఆడపిల్లల లాంటి వాళ్లే వాళ్లకి కుటుంబం ఉంటుంది.. ఎమోషన్స్ ఉంటాయని జనసేన పిల్ల సైనికులు గుర్తు పెట్టుకోవాలి.
ఎదుటి వాళ్ళను విమర్శించే ముందు వాళ్లింట్లో ఆడవాళ్లు ఉంటారని గుర్తుపెట్టుకోవాలని ఎమోషన్స్ అందరికి ఉంటాయని మీ ఇంట్లో ఆడవాళ్ళ లాగా మిగతా ఆడవాళ్లు కూడా అంటూ జనసేన సైనికులకు లెక్చర్ ఇచ్చింది. ఇక నాగబాబు బహిరంగ సభలు పెట్టి నీతులు చెప్పే ముందు ఇంట్లో ఆడపిల్లలకు నీతులు చెప్పాలని సటైర్ వేశారు.ఈ సందర్భంగా జనసేన పిల్ల సైనిక్స్‌కి చెప్పేది ఒక్కటే.. పరాయి మహిళ గురించి కామెంట్ చేసే ముందు మీ మెగా ఫ్యామిలీ ఆడవాళ్ళ గురించి ఆలోచించండి. నీతులు బయటి వాళ్లకే కాదు.. ఇంట్లో వాళ్లకి కూడా వర్తిస్తాయి.. ఇళ్లలో తల్లులు, చెల్లెలు, పెళ్లాలు కూడా మహిళలే. వాళ్లని కంట్రోల్‌లో పెట్టుకోండి’ అంటూ ఫైర్ అయ్యింది యాంకర్ శ్వేత రెడ్డి.



























