మరో సారి అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్… !!

0
277

నిమ్మగడ్డ ప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు. అనేక అవినీతి కేసులలో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఇపుడు తాజాగా మరొక కుంభకోణంలో ఇరుక్కొని జైలు పాలయ్యరు. అది కూడా మన దేశంలో కాదండోయ్ సెర్బియా దేశంలో… అక్కడి ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేసింది. అస్సలు దాని కథ ఎంటో చూద్దాం. ఐపీఎల్ తరహాలో ఫుట్ బాల్ లీగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫుట్ బాల్ లీగ్ కేరళ జట్టును నిమ్మగడ్డ తీసుకోవడంతో ఆటగాళ్ల కోసం సెర్బియా వెళ్ళడం జరిగింది. గత 8 నెలలుగా అక్కడే ఉంటున్న నిమ్మగడ్డని ఇప్పుడు అక్కడి సెర్బియా ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది..

పెట్టుబడుల విషయంలో, తమకు రావాల్సిన మొత్తం ఇవ్వలేదని రష్ అల్ ఖైమా అనే చిన్న దేశం ఇచ్చిన ఇంటర్పోల్ నోటీస్ తో సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను జైలుకి పంపించారు. తమకు రావాల్సింది తిరిగి ఇవ్వాల్సిందే అని రస్ అల్ ఖైమా న్యాయ పోరాటం చేస్తుంది. నిమ్మగడ్డ ఈ దేశానికి 2800 కోట్లకు పైగా బాకీ ఉన్నారని ఆ దేశం ఆరోపణలు చేస్తుంది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ ఒక కంపెనీ పెట్టడం జరిగింది దాని పేరు మాట్రిక్స్. దాని ద్వారానే తన వ్యాపారాలు అన్నీ కొనసాగించే వారు. అప్పుడే వాన్ పిక్ అనే ప్రాజెక్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రస్ అల్ ఖైమా నుండి నిధులు సేకరించిన తర్వాత విశాఖలో బాక్సైట్ గనుల తవ్వకాలపై పెట్టడం ఆ తర్వాత సీబిఐ కేసులు, మారిన పరిస్థితుల వల్ల ఈ ప్రాజెక్ట్ లు ముందుకు సాగలేదు. దానితో రస్ ఆల్ ఖైమా దేశానికి నిధులు తిరిగి ఇవ్వలేదు అని ఆరోపణ.

గల్ఫ్ దేశాల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టే భారతీయులకు తమ దేశాల్లో తీర్పులు వర్తించేలా తీర్పు ఉండాలని ఇతర దేశాలు భారత దేశాన్ని కోరడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సానకూలంగా స్పందించింది. దీనితో వెంటనే రస్ అల్ ఖైమ తమకి రావాల్సిన మొత్తాన్నీ వసూలు చేయడానికి నిమ్మగడ్డ ఆస్తులను జప్తు చేయడానికి సిద్దంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here