ఎన్నకల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రత్యెక హోదా అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ కు ప్రత్యెక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెల్చిచేప్పిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కి మాత్రమె కాదు ఇకపై ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యెక హోదా ఇవ్వమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే తాజగా పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజేపీ ప్రకటించిన మేనిఫెస్టో వివాదం అవుతుంది.

విషయం ఏమిటంటే.. పుదుచ్చేరీలో బిజేపీని గెలిపిస్తే ప్రత్యెక హోదా ఇస్తామని కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించడం, అదే విషయాన్నీ ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకహోదా అనేది మనుగడలో లేదని. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వమని పార్లమెంట్ లో తేల్చిచెప్పిన నేతలు ఇప్పుడు పుదుచ్చేరీ కి హోదా ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.