Nithin : 2002 జూన్ 14 న సరిగ్గా ఇదే రోజున జయం సినిమా విడుదలయింది. అందరు కొత్తవాళ్లతో దర్శకుడు తేజ చేసిన ప్రయోగం విజయవంతం అయింది. తెలుగు తెరకు కొత్త హీరో, హీరోయిన్, అలాగే ఎంతో మందీ ఆర్టిస్టులు పరిచయమయ్యారు. ఇక విలన్ గా గోపిచంద్ లో కొత్తకోణం బయటికి వచ్చింది. ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తయింది నేటితో. ఈ సందర్బంగా హీరో నితిన్ ఎమోషనల్ పోస్ట్ ఈ సినిమాను ఉద్దేశించి పెట్టారు.

సినిమా ప్రయాణంలో తోడున్న అందరికి కృతజ్ఞతలు…
డైరెక్టర్ తేజ ఎప్పుడు కొత్త వాళ్ళను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటాడు. అలానే జయం సినిమాతో నితిన్, సదా లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేసాడు. ఈ సినిమా మంచి విజయన్నందుకుని నితిన్ కి మంచి అవకాశాలను ఇచ్చింది. అలాగే సదా కూడా హీరోయిన్ గా మంచి అవకాశాలతో దూసుకుపోయింది. నిజానికి ఈసినిమాలో తొలుత హీరోయిన్ గా తెలుగమ్మాయి ప్రత్యూషని అనుకున్నా అనుకోని రీతిలో ఆమె ఆడిషన్స్ కి రాకపోవడం అలాగే ఆమె మరణించడం జరిగాయి.

ఇక అవకాశం సదాని వరించి తెలుగు నాట మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక విలన్ గా గోపీచంద్ నటన మర్చిపోలేనిది. నితిన్ హీరోగా ఆ తరువాత దిల్, సై వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అయితే నితిన్ 20 ఏళ్ల కెరీర్ లో విజయలకన్నా అపజయాలే ఎక్కువ. సై సినిమా తరువాత నితిన్ కి దాదాపు 12 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇంకో హీరో అయితే కెరీర్ దాదాపు ముగిసినట్లే కానీ నితిన్ మాత్రం ఏమాత్రం అలసిపోకుండా ప్రయత్నించి 2012 లో ఇష్క్ సినిమాతో మరోసారి సక్సెస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నితిన్ తన 20 ఏళ్ల కెరీర్ లో తనతో పాటు ప్రయాణించిన డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ కి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే అభిమానులకు ధన్యవాదములు తెలిపారు.






























