Nithin & Mangli : తెలంగాణ యాసతో సాంగ్స్ పాడుతూ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. ఈమె అటు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పాడుతూనే మరోవైపు తెలంగాణ పల్లెపాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక రాఖీ పౌర్ణిమ సందర్బంగా మంగ్లీ హీరో నితిన్ కి రాఖీ కట్టి వార్తల్లో నిలిచింది. నేడు రాఖీ పౌర్ణిమ ప్రతి సోదరుడు తన సోదరికి రక్షగా ఉంటానని తోడుగా నిలిచే పండగ అలాగే ప్రతి సోదరి తన సోదరుడు ఆయురారోగ్యాలతో బాగుండాలని భావించి రాఖీ కట్టి నోరు తీపి చేస్తుంది. అలాంటి రాఖీ పండగ రోజున మాములు జనాలు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా రాఖీ లు కడుతూ కట్టించుకుంటూ పండగ జరుపుకుంటున్నారు.

మాచర్ల నియోజకవర్గం సినిమా ఈవెంట్లో రాఖీ కట్టిన మంగ్లీ…
నితిన్ తాజాగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈరోజు హీరో నితిన్ ఆయన సోదరి నికిత రెడ్డి మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో సింగర్ మంగ్లీ యాంకర్ గా వ్యవహరించింది.
ఇక ప్రోగ్రామ్ చివర్లో నితిన్ కి వాళ్ళ అక్క నికిత రెడ్డి రాఖీ కట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపించగా హీరో నితిన్ తన అక్క కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక ఆతరువాత సింగర్ మంగ్లీ కూడా హీరో నితిన్ కి రాఖీ కట్టి స్వీట్ తినిపించింది. ఇక రాఖీ కట్టిన తోబుట్టువుకు ఏదో ఒక బహుమతి సోదరుడు ఇస్తారు. అలాగే మంగ్లీ కి నితిన్ స్వీట్ బాక్స్ తో పాటు చీర అలాగే ఇంకేదో బహుమతి కూడా ఉంది. ఇక ఇండస్ట్రీ లో మరికొంతమంది సెలబ్రిటి అన్నచెల్లెల్లు, అక్కతమ్ముళ్లు కూడా సంతోషంగా రాఖీ సెలెబ్రేట్ చేసుకున్నారు. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగష్టు 12 న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా మీద నితిన్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు.

































