Astrology : ప్రస్తుతం గ్రహాల మార్పు కారణంగా ఒక విశేషమైన నక్షత్ర పరిణామం చోటు చేసుకుంది. పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచరిస్తుండగా, ఆర్ద్రా నక్షత్రంలో గురువు ప్రవేశించడంతో ఇద్దరి మధ్య “నక్షత్ర పరివర్తన” ఏర్పడింది. ఈ పరిణామం 2025 ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా గురువు తన నవమ దృష్టితో రాహువును వీక్షించడంతో ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు, జీవనశైలిలో సానుకూల మార్పులు, ఇంటి యోగాలు, ప్రొఫెషనల్ విజయాలు వంటి శుభ ఫలితాలను అందించబోతోంది.

ఈ గొప్ప మార్పు ప్రభావం ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, సింహం, తులా, ధనుస్సు రాశులపై అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రాశుల వారికి ఏవేం ఫలితాలు లభించబోతున్నాయో వివరంగా చూద్దాం.
మేష రాశి (Aries)
గురు-రాహు పరివర్తన ప్రభావంతో మీ జీవితంలో ఆకస్మికమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్, పదవీ లాభాలు, ఆకస్మికంగా రావలసిన ధనం లభించే అవకాశాలు ఉన్నాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పిల్లల విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
వృషభ రాశి (Taurus)
ఈ గ్రహ సంయోగం వల్ల ధనం, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రత్యేక శుభ ఫలితాలు లభిస్తాయి. జీతభత్యాలు పెరగడంతో పాటు బకాయిలు వసూలవుతాయి. మంచి పేస్ ఉన్న ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. విదేశీ సంపాదనకు చక్కటి అవకాశాలు కలుగుతాయి. వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
మిథున రాశి (Gemini)
ఈ పరిణామం మీకు అత్యద్భుతమైన అదృష్టాన్ని అందిస్తుంది. విదేశీ ఉద్యోగాల కల నిజమవుతుంది. తండ్రి తరఫున ఆస్తి లాభం జరుగుతుంది. పదోన్నతులు, అధిక జీతభత్యాలు లభించవచ్చు. వ్యాపారాల్లో ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
సింహ రాశి (Leo)
ఈ కాలం మీరు చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఒప్పందాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. వ్యాపారాల్లో భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో విజయాలు, సంపన్న కుటుంబంతో సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. సంతానయోగం మెరుగవుతుంది.
తుల రాశి (Libra)
భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల, ఈ నక్షత్ర పరివర్తన ఫలితంగా ఆకస్మిక ధన లాభాలు, ఆస్తి లాభాలు కలుగుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల కారణంగా విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. పిల్లల విజయాలు గర్వకారణంగా నిలుస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సంతాన యోగం మెరుగవుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ కాలంలో ఊహించని శుభ యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల, జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజయోగం, ధనయోగం లభిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి రంగాల్లో లాభాలు వస్తాయి. వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశముంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
ఈ నక్షత్ర పరివర్తన సమయం ఆరు రాశుల వారికి గొప్ప అవకాశాలు తెచ్చిపెడుతుంది. గ్రహాల శక్తిని సద్వినియోగం చేసుకొని మీ లక్ష్యాలను సాధించండి. ఇదే సరైన సమయం!































