ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తుంటే మరో పక్క కరోనా నివారణలో అమెరికా పూర్తిగా విఫలమైందంటూ ఎన్నారై యాంకర్ స్వాతి దేవినేని చేసిన వ్యాఖలు తీవ్ర దుమారం రేగాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారైల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. దీనిపై అమెరికాలో కేసు నమోదు అయింది. తాజాగా తన వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు చెప్పారు.

అమెరికాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటాన్ని ఇండియాలోని కరోనా వైరస్ కేసులతో పోలుస్తూ ఆమె కొన్ని వ్యాఖలు చేసారు. దీనిపై అమెరికా ప్రభుత్వం సరైన చర్యలు చేసుకోలేకపోతోందని, భారత ప్రభుత్వం మాత్రం నివారణ చర్యల్లో చాలా మంచి ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చింది. అదేసమయంలో అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖలు చేసారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పెద్ద వివాదంగా మారిపోయింది.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎన్నారైలు భారతీయురాలిగా భారత్ ను మెచ్చుకుంటే తప్పులేదు కానీ అందుకోసం అమెరికాను దుయ్యబట్టడం కరెక్టు కాదంటూ ఆమెపై ఫైర్ అయ్యారు ఎన్నారైలు. మరోవైపు శ్రవణ్ అనే తెలుగు ఎన్నారై స్వాతి దేవినేనిపై న్యూయార్క్ లోని ఒక పోలీస్టేషన్ లో ఫిర్యాదుచేశారు. అమెరికా ప్రజలలో విద్వేషాన్ని రేకెత్తించేలా స్వాతి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై ఒక వీడియోని రిలీజ్ చేసారు.

అనుకోని పరిణామాలతో షాక్ తిన్న ఎన్నారై యాంకర్ స్వాతి దేవినేని వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలకు భాద్యతగా సారీ చెబుతున్నానని.. తాను ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే చెప్పానని అయినా ఆ వీడియోలో నేను మాట్లాడాను కాబట్టి దానికి పూర్తీ భాద్యత వహిస్తూ క్షమాపణలు చెబుతున్నాని చెప్పారు. మొత్తానికి ఈ విషయం అమెరికా కోర్టు వరకు వెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here