NTR : అభిమానులందరు ఆప్యాయంగా ‘అన్నగారు’ అని ప్రేమగా పిలుచుకొనే ఎన్టీఆర్ తెలుగు తమిళ హిందీ భాషల్లో దాదాపు 400 సినిమాలు చేశారు. నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు జాతి కీర్తిని అన్నివైపులా తెలియజేసాడు. అయన సినిమా అంటేనే ఒక ఆణిముత్యం, సినిమాకు సంబందించిన అన్ని విషయాల్లోను పక్కాగా ఉంటారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా పక్కాగా ఉండేవారట. సినిమా ప్రారంభం అయ్యింది అంటే ఏ రోజు కాని ఆలస్యంగా వెళ్లిన దాఖలాలు లేవు, అంతలా నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడేవారట.

ముందుగానే అడ్వాన్స్ తీసుకొనే సాంప్రదాయం ప్రారంభించిన ఎన్టీఆర్…
ఎన్టీఆర్ షూటింగుల సమయంలో కూడా నిర్మాతలకు ఖర్చు పెరగకుండానే చూసేవారట. బయట షూటింగులకు వెళ్లిన ఎక్కువగా డిమాండ్ చేసేవారు కాదట. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కాస్త కఠినత్వం ఉండేదట. రెమ్యూనరేషన్ కాస్త అడ్వాన్స్ గా తీసుకొనే పద్ధతి కూడా ఆయనే ప్రారంభించారట. అయన సినిమాలు చేసే మొదట్లో నెల జీతం తీసుకొని స్టూడియోల కోసం పనిచేసే వారట. రెమ్యూనరేషన్ విధానం మొదలయ్యాక మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డారట.

మొదట్లో దాదాపు పది చిత్రాల విషయంలో అయన మోసపోయారట. నిర్మాతలు డబ్బు ఇస్తామని చెప్పి చివరకు ఇవ్వకుండా మోసం చేశారాట. దీంతో అయన పద్దతి మార్చుకొని రెమ్యూనరేషన్ విషయంలో కఠినంగా ఉండటం మొదలు పెట్టారాట. అందుకే అడ్వాన్స్ పద్దతి తీసికువచ్చారు. సినిమా ముందు కొంత, మధ్యలో, చివరగా అని మూడు విడతల్లో తీసుకునేవారట. కానీ మిగతా హీరోల్లా కాకుండా నిర్మాత ఇవ్వగలిగే వారు అయితేనే రెమ్యూనరేషన్ పెంచుతారట. లేకపోతే నిర్మాతకు తగ్గట్టు మాత్రమే తీసుకుని ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు.






























