NTR craze : ఆర్ఆర్ఆర్ సినిమా ఏప్రిల్ లో విడుదలయి అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన అందరిని ఆకట్టుకుంది. వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు సినిమాకు హైలైట్. ఇక సినిమాలో ఎన్టీఆర్ కు స్క్రీన్ స్పేస్ తక్కువైందని అభిమానులు గింజుకున్నా కొమరం భీముడో పాటకు వస్తున్న క్రేజ్ కు హ్యాపీ అవుతున్నారు. ఈ మధ్యనే కొమరం భీముడో పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఇక ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఎన్టీఆర్ గురించి ప్రశ్న….
ఆర్ఆర్ఆర్ మేనియా ఇంకా తగ్గనే లేదు. ఈ మధ్య చాలా మంది రీల్స్ లో ఇంకా నాటు నాటు అనో కొమరమ్ భీముడో అనో పాటలకు వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇపుడు తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలలో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఎన్టీఆర్ కొమరం భీముడు గురించి ప్రశ్న వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరంభీం పాత్రలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ను మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి, సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయండి అని ప్రశ్నగా ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఊరికే ఉంటారా… ఆ పేపర్ ను సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ వైరల్ చేసేసారు.
In an examination question paper Asked about Jr ntr performance in RRR Movie….
— Vishnu (@vishnuNtr9999) May 10, 2022
That’s the impact BHEEM character created all over the Country…@tarak9999 @ssrajamouli@RRRMovie @AlwaysRamCharan #RRRMovie pic.twitter.com/iJ9rqi0L1N
అది అన్న యాక్టింగ్ పవర్ అంటూ.. తారక్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అట్లుంటది తారక్ అన్నతోని అంటు మరికొందరు ఫ్యాన్స్ అంటు రచ్చ చేస్తున్నారు. అన్న నటన కు సంబంధించిన లైబ్రరీ అంటూ మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఏ సినిమా అందుకొని మరో రికార్డును ఆర్ఆర్ఆర్ నమోదు చేసింది. హైదరాబాద్ లోని సుదర్శన్ 35mm థియేటర్లో 50 రోజులకు 5 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.






























