NTR -Rajendra Prasad: నట కిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈయన నిమ్మకూరు సమీపంలో దొండపాడు గ్రామంలో జన్మించారు.ఇక నిమ్మకూరు స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వస్థలం చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ పెరిగిన రాజేంద్రప్రసాద్ కు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి కలిగింది. ఎన్టీఆర్ సహాయంతోనే రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలోకి వచ్చానని ఎన్నోసార్లు వెల్లడించారు.

ఈ విధంగా చెన్నైలోని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణలో కోచింగ్ తీసుకున్న రాజేంద్రప్రసాద్ అనంతరం అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా మొదట్లో ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకొని అనంతరం నటుడిగా అవకాశాలు అందుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా ఎంతో అవలీలగా నటించే రాజేంద్రప్రసాద్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాత అశ్విని దత్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రాజేంద్రప్రసాద్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్నార్ పాత్రలు కూడా కనపడతాయి. అయితే ఏఎన్ఆర్ పాత్ర నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ పాత్రలో కేవలం రెండు డైలాగులు మాత్రమే ఉంటాయి. అవి కూడా వెనక మాత్రమే కనపడతాయని తెలిపారు.

NTR -Rajendra Prasad: మహానటి సినిమా కోసం డబ్బింగ్ చెప్పిన నట కిరీటి…
ఇలా మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ఉన్న రెండు డైలాగులకు ఎన్టీఆర్ తరహాలోని రాజేంద్రప్రసాద్ ఎంతో చక్కగా డబ్బింగ్ చెప్పారని ఈ సందర్భంగా అశ్విని దత్ పేర్కొన్నారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా అశ్విని దత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈయన నిర్మాణంలో వచ్చిన సీతారామం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.





























