NTR & Rana : ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబాలంటే నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, మెగాస్టార్ ఫ్యామిలీలు. అయితే ఇందులో నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు సినిమా ఇండస్ట్రీ ను కొత్త పుంతలు తొక్కించాయి. హీరోలుగా నందమూరి, అక్కినేని వాళ్ళు ఇంక లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామా నాయుడు సినిమా నిర్మాణంతో సినిమా పరిశ్రమకు సేవ చేసారు. ఇక ఈ కుటుంబాల మధ్య సత్సంబదాలు కూడా ఉన్నాయి. ఇక అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు వియ్యంకులు కూడా. రామానాయుడు గారి కూతురు నాగార్జున పెళ్లి చేసుకున్నారు. అయితే మళ్ళీ వాళ్లిద్దరూ విడిపోయినా ఇరు కుటుంబాల మధ్య బంధం అలాగే ఉంది. ఇక నాగచైతన్య సినిమాలకోసం రానా, అలాగే వెంకటేష్ కూడా మేనల్లుడు నాగచైతన్య సినిమాలో నటించాడు, అలాగే ప్రమోట్ చేస్తుంటాడు. ఇక నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.

బావ… బావ… అంటూ రానా, ఎన్టీఆర్…
ఇక మూడో తరం నటవారసులు ఇప్పుడు ఈ కుటుంబాలనుండి వస్తున్నారు. సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక నందమూరి కుటుంబం నుండి జూనియర్ ఎన్టీఆర్ అలాగే దగ్గుబాటి కుటుంబం నుండి రానా హీరోలుగా రానిస్తున్నారు. బాహుబలి సినిమాతో రానా, అటు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఇండియా హీరోలైపోయారు. అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరోలుగా రానా, ఎన్టీఆర్ ఉన్నారు.

ఎంత పెద్ద సూపర్ స్టార్ లు అయినా ఇద్దరు హీరోలు మేము గొప్పవాళ్ళం అనే అహం లేకుండా సింపుల్ గా ఉంటారు. ఇక వీరిద్దరూ బావ బావ అని పిలుచుకోవడం అందరినీ ఆకట్టుకుంది. మీ లో ఎవరు కోటీశ్వరుడు షో కోసం రామ్ చరణ్ వచ్చినపుడు ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవచ్చు అన్నపుడు చరణ్ రానా కి కాల్ చేసాడు. అయితే రానా, ఎన్టీఆర్ బావ బావ అంటూ పలకరించుకున్నారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రానా తండ్రి సురేష్ బాబు ని మామ అంటూ ఎన్టీఆర్ పిలుస్తుంటారు. అలా రానా బావయ్యాడేమో. నిజానికి ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని కూడా బావ అని పిలుస్తాడు. ఇక నాగార్జునని బాబాయ్ అంటూ పిలుస్తుంటాడు. ఇలా అందరినీ వరసలతో పిలవడం ఎన్టీఆర్ కి అలవాటు.




























