NTR Vs Krishna : నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరూ మాస్ హీరోలు. ఎన్టీఆర్ తరువాత అంతటి ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరో ఇండస్ట్రీలో కృష్ణ గారే. అదీకాక సినిమాల్లో ప్రయోగాలకు కృష్ణ పెట్టింది పేరు. ఏడాదికి పది సినిమాలకు తగ్గకుండా సినిమాలను చేస్తూ కృష్ణ అగ్రహీరోలైన ఎన్టీఆర్, నాగేశ్వరావు లకు పోటీ ఇచ్చారు. అలాంటి కృష్ణ, ఎన్టీఆర్ లు ఒకేలాంటి కథతో సినిమా తీసి ఒకేరోజున విడుదల చేసి పోటీ పడ్డారు. ఆ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలింది.

అటు దాన వీర శూర కర్ణ… ఇటు కురుక్షేత్రం…
మహాభారతంలోని కురుక్షేత్రం ఉదంతంతో తెరకెక్కిన రెండు చిత్రాలు ఒకటి ఎన్టీఆర్ ‘డివిఎస్ కర్ణ’ అయితే మరొకటి కృష్ణ ‘కురుక్షేత్రం’. రెండు సినిమాల్లోనూ ఒకటే కథ. ఇక ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేస్తూ కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా మూడు పాత్రలలో మెప్పించారు. ఇక ఆయన తనయులు హరికృష్ణ అర్జునుడు గా బాలకృష్ణ అభిమన్యుడిగా మెప్పించారు. కేవలం 45 రోజుల్లో షూటింగ్ చేసిన ఈ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ ప్రతిష్టత్మకంగా చేసిన చిత్రం కురుక్షేత్రం.

ఇక ఇందులో కృష్ణ అర్జునుడిగా, కృషుడుగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణం రాజు నటించారు. ఈ సినిమా కృష్ణ కెరీర్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం రెండు సినిమాలు ఒకేరోజున 1977 జనవరి 14 న విడుదల అయ్యాయి. ఇక రెండు సినిమాల్లో దాన వీర శూర కర్ణ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొదటి సారి కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రికార్డులు సృష్టించింది. అదే ఏడాది ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు, యమగోల సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచి మరే హీరో కి ఇంతవరకు సాధ్యపడని ఒకే ఏడాది హ్యాట్రిక్ విజయాలను ఎన్టీఆర్ నమోదు చేసారు.



























