NTR : ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చ ఎక్కడ చూసినా అంతలా రచ్చ చేస్తోంది. రాజమౌళి తన మాస్టర్ మైండ్ తో తీసిన ఈ అద్భుతాన్ని అందరు అశ్వాదిస్తున్నారు. ఇక ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన అయితే ఇక చెప్పక్కర్లేదు. వారి కెరీర్ బెస్ట్ ఇచ్చారు ఇద్దరు. ఇకవారి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా ఇప్పట్లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అనేలా తీసాడు జక్కన్న. ఇక బాలీవుడ్ లో అయితే ఆర్ఆర్ఆర్ ఫీవర్ బాగానే పట్టుకుంది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కొన్ని మీడియా సంస్థలతో సినిమా విడుదల తర్వాత ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూల్లో ఆసక్తికర వాఖ్యలు చేసారు.
తన కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే ఆర్ఆర్ఆర్ ముందు ఆర్ఆర్ఆర్ తర్వాత అని చెప్పాలని తన కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని చెప్పారు. ఇందులో టైగర్ తో సన్నివేశం గురించి అడుగగా రాజమౌళి ఏం చెప్పారో ఆది చేయడం మాత్రమే మా బాధ్యత అంటూ ఆసక్తికరంగా చెప్పారు.భీం వంటి బలవంతమైన పాత్రలో జంతువులతో నా ఎపిసోడ్ గురించి రికార్డ్ చేసిన ఒక వీడియో పై ప్రేక్షకుల స్పందన చూసి మతిపోయింది. రాజమౌళి కి ఆడియన్స్ పల్స్ బాగానే తెలుసనీ ఏ సన్నివేశానికి ఏ వర్గం ఆడియన్స్ ఆకర్షితులవుతారో బాగానే తెలుసు కాబట్టే తాను సినిమా ను సక్సెస్ ట్రాక్ లో నిలుపుతాడు అంటూ వాఖ్యనించారు.



























