Ntr : నందమూరి నట వారసుడుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిలా పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటి వరకు 100 కి పైగా చిత్రాలలో నటించి అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో కలసి నటించాడు. అయితే అప్పట్లో భానుప్రియ, సుహాసిని, విజయశాంతి, రాధ, రజనీ వంటి వారు ఆయనకు సరైన జోడిగా ఉన్నారు. ఈ హీరోయిన్లతో బాలకృష్ణ చాలా సినిమాలలో నటించారు. అయితే హీరోయిన్ రాధ తో మాత్రం కేవలం నాలుగు సినిమాలలోనే నటించారు. అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదట.

హీరోయిన్ రాధ కోరిక మేరకే ఆ సినిమా…
రాధ కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. రాధకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. ఇద్దరు కూతుర్ల గురించి మనకు తెలిసిందే. కార్తీక, తులసి ఇద్దరూ హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. వీరిద్దరినీ స్టార్ హీరోయిన్లు చేసేందుకు చాలా కష్టపడ్డారట. తులసి, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’ సినిమా చేసినప్పటికీ తరువాత కనిపించలేదు. ఇక కార్తీక కొన్ని సినిమాలు చేసినప్పటికీ తెలుగులో ‘రంగం’ సినిమాగా వచ్చిన తమిళ్ సినిమా ‘కో’ మాత్రమే తన కెరీర్లో మంచి విజయం.

అయితే కార్తీక ను మంచి హేరోయిన్ గా నిలబెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ ను తన సినిమాలో అవకాశం ఇవ్వమని డైరెక్ట్ గా అడిగిందట. అందుకు తారక్ కూడా కాదనకుండా ‘దమ్ము’ సినిమాలో హీరోయిన్ గా రికమెండ్ చేశారట. కాకపోతే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అందులోనూ సినిమా సరిగా ఆడకపోవడానికి అందులోని హీరోయిన్లు అయిన కార్తీక, త్రిష లు కూడా కారణంగా నిలిచారు. పైగా కార్తీక ఎక్స్ప్రెషన్స్ సరిగా లేవని కామెంట్లు కూడా వచ్చాయి. ఆ తరువాత కార్తీక కు సినిమా అవకాశాలు రాలేదు. సిస్టర్ రోల్ చేసినా ఎందుకోమరి ప్రేక్షకులు పట్టించుకోలేదు.
































