ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాకారం లేదు.. : ఆనందయ్య

0
168

కరోనా కట్టడికోసం కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య తెలిపారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మందు అందిస్తున్నామని అందువల్ల ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు.

అయితే మందు పంపిణీకి పలు ఆటంకాలు వస్తున్నాయని, అందువల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదన్నారు ఆనందయ్య. కాగా.. మందు పంపిణీకి సరిపడ వనరులు తమకు సమాకూరడం లేదని విద్యుత్ సౌకర్యంతో పాటూ మందు తయారీకి కావాల్సిన యంత్ర సామగ్రికూడా లేదని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అనుమతులు ఇచ్చారు కానీ.. ఇప్పటి వరకు ఎటువంటి సహకారం అండలేదని ఆనందయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాల వారికీ కరోనా ఆయుర్వేద మందును అందిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here