కెజిఎఫ్ సినిమా తో దేశ వ్యాప్త గుర్తిపు తెచ్చుకున్నాడు యష్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకుడు.. ఈ సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేశాడనడం లో ఎలాంటి సందేహం లేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది సినిమా.. కేజిఎఫ్ సినిమా వచ్చె అంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది..

అక్కడి సినిమాలకోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఇక యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమా కేజిఎఫ్ పార్ట్ 2. చాలా ట్విస్ట్ లతో రెండో పార్ట్ తెరకెక్కుతుండగా ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇటీవలే పూర్తి చేసుకోగా సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా యష్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
యష్ కుటుంబీకులు, హాసన్ జిల్లాలోని గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుందియశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని తిమ్మెనహల్లి గ్రామానికి చెందినవారు. ఆ ఊళ్లో వాళ్లకో సొంత ఇల్లు ఉంది. రీసెంట్ గా 80 ఎకరాల భూమిని యశ్ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. స్థానికంగా ఉండే గ్రామస్తులు, యష్ తల్లిదండ్రులకు మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లడం కష్టమని, గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తాతల కాలం నుండి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని పట్టుబట్టారు. ఈ విషయమై చర్చించడానికి నటుడు యశ్ మంగళవారం తిమ్మాపురకు వెళ్లారు. యశ్ వస్తున్నట్లు తెలిసి వందలాది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.



























