Oke oka jeevitham : అమల, శర్వానంద్, వెన్నెల కిషోర్, కీలక పాత్రలలో నటించిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను సినిమా యూనిట్ మొదలు పెట్టారు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అయిపోయి వినూత్నంగా ప్రొమోషనల్ కార్యక్రమాలను చేసారు. ఒకేఒక జీవితం సినిమాలో అమల గారు శర్వానంద్ కి అమ్మగా నటించారు. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం అమల గారితో రియల్ కొడుకు అఖిల్, రీల్ కొడుకు శర్వానంద్ తో కలిసి వంట చేస్తూ సినిమా గురించి మాట్లాడారు. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలందరి ఇష్టమైన ఫుడ్ గురించి కూడా చర్చించారు.

నాగ్ వంట చేస్తున్నాడంటే.. ఏదో టెన్షన్ లో ఉన్నాడని అర్థం…
ఇక అమల శాకాహారి అలాగే వేగన్, దీంతో ఆమె పాయసం చేస్తూ సినిమా గురించి అఖిల్, శర్వానంద్ తో సరదాగా మాట్లాడారు. ఇంట్లో ఏదైనా శుభవార్త ఉన్నా, పుట్టినరోజు అయినా పాయసం చేస్తామని అందుకే పాయసం చేస్తానని అమల చెప్పారు. ఇక ఒకవైపు శర్వానంద్, అఖిల్ తో డ్రై ఫ్రూట్స్ కట్ చేయిస్తూ సరదా కబుర్లు చెప్పారు. ఇక హీరోలలో ఎవరికి ఏ ఫుడ్ ఇష్టమని మాట్లాడుతూ రామ్ చరణ్ కి పప్పు అప్పడం అంటే చాలా ఇష్టమని ఇక భోజనం లో ఖచ్చితంగా పెరుగు ఉండాలంటూ శర్వానంద్ చెప్పారు. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్ అనగానే అఖిల్ హలీం అంటూ చెప్పాడు. హలీం ఉంటే ఇంకెవరూ పక్కన కనిపించరని అంతే కాదు బిర్యానీ చాలా బాగా చేస్తాడు బెస్ట్ కుక్ అంటూ శర్వ, అఖిల్ చెప్పారు.

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ తాను బాగా ఫుడీ తన దగ్గరికి తినడానికి వెళితే ఇక అంతే వారానికి సరిపడా ఫుడ్డు పెడతాడు అంటూ చెప్పారు. ఇక అమల మా అత్తయ్య అంతే ఎవరైనా ఇంటికి వస్తే చాలా ఫుడ్ పెడుతుంది అని చెప్పారు. ఇక చైతన్య కి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమని, ఇక అఖిల్ కి కూడా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమని అమల చెప్పారు. ఇక నాగార్జున వంట బాగా చేస్తాడని, అయితే ఎక్కువగా నాన్ వెజ్ చేస్తారని, అయితే ఒక వెజ్ కర్రీ నాకోసం ఖచ్చితంగా చేస్తాడని అమల చెప్పారు. బయటి నుండి రాగానే నాగార్జున వంట చేస్తున్నాడంటే కచ్చితంగా ఏదో టెన్షన్ లో ఉన్నాడని అర్థం అంటూ అఖిల్ చెప్పాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఒక తల్లి కొడుకు బంధానికి టైంట్రావెల్ ముడి పెట్టి సినిమా కథ ఉంటుందని చెప్పారు.






























