టీడీపీకి మరో ఎమ్మెల్యే షాక్… పార్టీ భవిష్యత్తేంటో…?

0
336

2014 – 2019 మధ్య ఐదేళ్ల పదవీకాలంలో టీడీపీ చేసిన తప్పులు అన్నీఇన్నీ కావు. టీడీపీ పాలనలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి అంతాఇంతా కాదు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ చేసిన దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫలితంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది.

అయితే గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలోకి కుదరని పక్షంలో బీజేపీ జనసేన కూటమిలో చేరడానికి ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అధికార పార్టీ వైసీపీకి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ మద్దతు తెలపడానికి సిద్ధమవుతున్నారు.

ఇకపై టీడీపీ కార్యకలాపాలకు పూర్తి దూరంగా ఉండబోతున్నారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తే మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని గతంలో చేసిన ప్రకటన నేపథ్యంలో వాసుపల్లి గణేష్ పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలపనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా మరో ఎమ్మెల్యే వైసీపీలో చేరడంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది.
 
వాసుపల్లి గణేష్ కాఏపట్లో సీఎం జగన్ ను కలిసి పార్టీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించబోతున్నారు. ఇకపై వైసీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. వరుస షాకుల నేపథ్యంలో టీడీపీ రాష్ట్రంలో రోజురోజుకు బలహీనపడుతోంది. మరి కొంతమంది నేతలు కూడా త్వరలో టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here