ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రానిక్ మయం అయిపోతుంది. చేతిలో మొబైల్ ఫోన్, దానికి ఓక ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఎక్కడనుంచి అయినా.. ఎప్పుడైనా షాపింగ్ చేసే అవాకారం ఉండటంతో యువత ఆన్లైన్ షాపింగ్ పైనే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. బట్టలు, షూస్, నిత్యావసర వస్తువులు, ఎలెక్ట్రానిక్ వస్తువులు ఆఖరికి మన తినే ఫుడ్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఈ కామర్స్ వెబ్సైట్లు వెలిసాయి. ప్రపంచం మొత్తం ఆన్లైన్ చుట్టూ తిరుగుతుంటే మద్యం ఆన్లైన్ లో అమ్మితే తప్పేముంది అనుకుంటున్నారో ఏమో. తాజాగా లిక్కర్ ఇండస్ట్రీ కూడా ఆన్లైన్ సేల్స్ ద్వారా మద్యం అమ్మకాలను పెంచుకునే పనిలో పడింది. వైన్ షాప్ ముందు క్యూకట్టే బదులు ఇక ఉన్నచోట నుంచే ఆన్లైన్ ద్వారా మద్యం కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ క్రమంలో మద్యం అమ్మకాలను ఆన్లైన్ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో భాగంగా మధ్య ప్రదేశ్ ప్రభుతం కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఇక ఇప్పటినుంచి ఆన్లైన్ లో లిక్కర్ అమ్మకాలను అనుమతిస్తున్నారు ప్రకటించింది. ఇంకేముంది మందుబాబులకు నిజంగా మత్తెకించే వార్తే… ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది మధ్యప్రదేశ్ ప్రభుతం. కొనుగోలు చేసిన వెంటనే ఇంటికి డెలివరీ చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ ఆన్లైన్ మద్యం అమ్మకాల విధానం ద్వారా గతంలో కంటే గుణకాలు మరింత పెరిగే అవకాశం ఉందని లిక్కర్ ఇండస్ట్రీ అంచనా వేస్తుంది. దీన్ని కొంతమంది స్వాగిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు.



























