Ooha : కన్నడ సినిమా ‘హృదయ సామ్రాజ్యం’ సినిమాతో పరిచయమైన ఊహ అసలు పేరు ఉమా మహేశ్వరి. సినిమాల్లోకి వచ్చాక శివరంజనిగా పేరు మార్చారు. ఇక తెలుగులో ఊహ గా పేరు మార్చుకుంది. 1994 లో వచ్చిన ‘ఆమె’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఊహ అందులో నటించిన కో ఆర్టిస్ట్ హీరో శ్రీకాంత్ ను 1997 లో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఊహ మేన మామ అభ్యుదయ భావాల రచయిత పి ఎల్ నారాయణ గారు.

ఇక శ్రీకాంత్, ఊహ లకు ముగ్గురు పిల్లలు రోషన్, మేధా, రోహన్. ఇక రోషన్ కూడా హీరో గా ‘నిర్మల కాన్వెంట్’ సినిమా ద్వారా పరిచయమాయ్యడు. గ్యాప్ తరువాత పెళ్లి సందడి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇపుడు అశ్వినీదత్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. ఇక ఎప్పుడు మీడియాకు దూరంగా ఉండే ఊహ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన రీ ఎంట్రీ గురించి మాట్లాడారు.

సినిమాల్లోకి మళ్ళీ రావాలని ఆసక్తి లేదు…..
ఇక ఊహ పెళ్లి తరువాత సినిమాలను వదులుకున్నారు. పూర్తిగా కుటుంబ భాద్యతలకు అంకితమయ్యారు. పిల్లలు పుట్టాక వారి బాధ్యతలతో ఇక సినిమాల గురించి ఆలోచించడం మానేసారు. చాలా మంది హీరోయిన్లు పెళ్ళై, పిల్లలు పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంటారు. తల్లి, అక్క పాత్రలతో మళ్ళీ నటిస్తారు. ఊహ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది.

ఇపుడు పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా అని అడిగితే ఆ ఆసక్తి లేదని క్లారిటీ గా చెప్పేసారు. పిల్లలు బాధ్యతలతో బిజీగా ఉన్నానని అసలు సినిమాల వైపు ఆసక్తి లేదని చెప్పారు. అయితే ఒక కోరిక మాత్రం ఉందని, ఒకవేళ రోషన్ హీరోగా నటించే సినిమాలో తల్లి పాత్ర అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. రోషన్ కి తల్లిదండ్రులుగా మేమిద్దరం నటించాలని ఉందని మనసులోని మాట చెప్పారు.



































