సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మెగా ఫ్యామిలీ కి ఎప్పటినుంచో వైరం ఉన్న విషయం తెలిసిందే.. ఏ చిన్న ఛాన్స్ దొరికినా వర్మ మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ ఉంటాడు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఇతరులను కూడా ఆయనమీదకి ఉసిగొల్పుతుంటాడు. వాస్తవానికి అయన ఒక్క మెగా ఫ్యామిలీ అనే కాదు అందరిని ఇలాంగే గెలుకుతుంటాడు కానీ మెగా ఫ్యామిలీ ని మాత్రం ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాడు. అయన ఏది చేసినా సంచలనమే అవుతుంది ఈమధ్య.. ఎప్పుడో చేసిన దాన్ని ఇప్పుడు తలచుకుని దాన్ని ట్వీట్ చేసి వైరల్ గా చేయడం ఆయనకు చిటికె లో పని..
రామ్ గోపాల్ వర్మ సినిమా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందినా ఇప్పుడు వివాదాస్పద ట్వీట్ ల ద్వారా రోజు ప్రజల నోళ్ళల్లో నానుతున్నారు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెడుతూ, ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. దానికి తోడు యూట్యూబ్ ఛానళ్లలో కామెంట్స్ చేస్తూ పాపులర్ అవుతుంటారు. ఈ తరం వారికి రామ్ గోపాల్ వర్మ అంటే దర్శకుడిగా కాకుండా వివాదాస్పద వ్యక్తిగా మాత్రమే తెలుసు.. దర్శకుడిగా అయన మంచి సినిమాలు చేసి చాలా సంవత్సరాలే అయ్యింది.
ఇకపోతే తాజాగా మరొక విషయం సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. ఆర్జీవీ, మెగా ఫ్యామిలీ మధ్య వైరానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అని తెలుస్తుంది.. ఈ విషయాన్నీ నాగబాబు తన ఇంస్టా రీల్ లో తెలియజేశారు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ ఎంతగానో అభిమానించే ఊర్మిళ.. ఈ హీరోయిన్ వల్లే వారికీ మధ్య వైరం తలెత్తిందట.. ఎందుకు ఆ వివాదం తలెత్తింది.. మెగా ఫ్యామిలీ లో ఎవరు ఏమన్నారని ఆర్జీవీ ఇంతలా వారిని దుయ్యబడుతున్నారు అనేది ఇంకా తెలీదు. మరి వీరి మధ్య వైరం ముగిసిపోవాలని చాలామంది ఫ్యాన్స్ కోరుతున్నారు.





























