టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దాదాపు దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగినా నటీమణులు ప్రస్తుతం పెళ్లి చేసుకొని తమ భర్త, పిల్లలతో జీవితాలను కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

రాధ

కొండవీటి దొంగ, దొంగ, యముడికి మొగుడు, రాక్షసుడు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధా 1991వ సంవత్సరంలో రాజశేఖర్ నాయర్ ని పెళ్లి చేసుకొని కార్తీక నాయర్, తులసి నాయర్, విగ్నేష్ నాయర్ లకు జన్మనిచ్చింది.
రంభ

2010 సంవత్సరంలో పద్మనాథన్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ రంభ లావణ్య, సాషా ఇద్దరు పండంటి ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
మోహన్ బాబు

మోహన్ బాబు భార్య అయిన మంచు విద్యా దేవి మరణాంతరం కలెక్షన్ కింగ్ మంచు నిర్మల దేవి ని వివాహం చేసుకున్నాడు. కాగా అతడికి మంచు లక్ష్మి, మంచు మనోజ్, మంచు విష్ణు వర్ధన్ బాబు జన్మించారు.
మంచు విష్ణు

2009వ సంవత్సరంలో విరోనికా రెడ్డి ని మంచు విష్ణు వివాహం చేసుకున్నాడు. కాగా ఈ దంపతులకు నలుగురు పిల్లల సంతానం కలిగింది.
విజయకుమార్

స్నేహం కోసం సినిమాలో చిరంజీవి స్నేహితుడిగా నటించిన విజయ కుమార్ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఐదుగురు అమ్మాయిలకు, ఒక అబ్బాయికి తండ్రయ్యాడు. అందులో ఇతని కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మరొక అమ్మాయి ప్రీత విజయ్ కుమార్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా లో హీరోయిన్ గా నటించింది.
పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా… అతనికి నలుగురు పిల్లల సంతానం కలిగింది.
శ్రీకాంత్

హీరో శ్రీకాంత్ సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వెంకటేష్

దగ్గుబాటి వెంకటేష్ 1985లో నీరజా ని పెళ్లి చేసుకొని అర్జున్ దగ్గుబాటి, ఆశ్రిత దగ్గుబాటి, భావన దగ్గుబాటి, హయవాహిని దగ్గుబాటి లకు తండ్రి అయ్యాడు.
చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సురేఖ ని 1980 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీరికి రామ్ చరణ్, శ్రీజ, సుష్మిత అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.



























