సాధారణంగా మన తెలుగు హీరోలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపుతారు.. ముఖ్యంగా ఒక స్టార్ హీరో ఒక్కో సినిమాకు కొన్ని కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ ఉంటారు.. అలాంటి హీరోలు తమ పెళ్ళి కోసం ఎంత కట్నం తీసుకుని ఉంటారు?పెళ్లికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు.? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..!!

రాంచరణ్ – ఉపాసన:

వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరు అవగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. అటు కట్నం కింది రాం చరణ్ సుమారు 300 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల్లో ఎక్కువ కట్నం తీసుకున్న వ్యక్తిగా చిరంజీవి కొడుకు నిలిచాడు.

అల్లు అర్జున్- స్నేహ రెడ్డి:

అల్లు రామలింగయ్య మనవడు , అల్లు అరవింద్ పెద్ద కొడుకు అయిన అల్లు అర్జున్.. స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నాడు. స్నేహరెడ్డి తండ్రి ఒక పొలిటీషియన్ కావడంతో అల్లు అర్జున్ కి కట్నం కింద సుమారు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సమాచారం. అలాగే వీరిద్దరి పెళ్లి వేడుకకోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.

ఎన్టీఆర్ – ప్రణీత:

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తన పెళ్లికి దాదాపు10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాడు . ప్రణితను వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఆయన మామ నార్నె శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపార వేత్త కావడంతో తనకు 200 కోట్ల రూపాయలు కట్నంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు – నమ్రత:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన కంటే వయసులో పెద్ద అయిన హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్నం తీసుకోకుండా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఇంట్లో వాళ్లకు తెలియకుండా జరగడంతో ఇందుకోసం కేవలం 10 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత నమ్రత తన మీద ఉన్న ఆస్తులను మహేష్ బాబు పేరిట రాసినట్లు తెలుస్తోంది.

గోపిచంద్ – రేష్మ:

హీరో శ్రీకాంత్ మేన కోడలు రేష్మని గోపిచంద్ వివాహం చేసుకున్నాడు. అయితే గోపిచంద్ కట్నం కింద 8 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం . వీరి పెళ్లికి కోటిన్నర ఖర్చు చేశారట.

ఆది – అరుణ:

సాయి కుమార్ కొడుకు ఆది.. అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కట్నం కింద రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. వీరి పెళ్లి వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

నాని – అంజన:

నాచురల్ హీరో నాని , అంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ అయినా నానీ కట్నం కింద 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తన పెళ్లి వేడుకక కోసం దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంట మన న్యాచురల్ స్టార్ నాని.. !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here