ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్ష మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజగా ఈ వైరస్ బలియైన వారిలో పాక్ క్రికెటర్ ఉండటం యావత్ క్రికెట్ అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే కరోనా సోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రంజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ (50) మృతి చెందారు. అంతకు ముందే మరో అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన మూడురోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో అయన శరీరం స్పందించకపోవడంతో తుది శ్వాస విడిచారు.

సర్ఫరాజ్ 1988 లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసారు. తన కెరీర్ లో 15 ఫాస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అయన 616 పరుగులు చేసారు. 1994 లో రిటైర్మెంట్ ప్రకటించారు. అయన కెరీర్ లో ఆరు దేశవాళీ వన్డేలు ఆడిన అయన 96 పరుగులు చేసారు. రిటరీర్మెంట్ తరువాత సర్ఫరాజ్ కోచింగ్ భాద్యతలు చేపట్టారు. సీనియర్ టీం తో పటు పెషావర్ అండర్-19 టీం కి అయన కోచింగ్ ఇచ్చారు.




























