లైవ్ టీవీ డిబేట్ ఒక ఎంపీ చెంప పగలగొట్టే వరకు వెళ్ళింది. సాధారణంగా టీవీలో రాజకీయ డిబేట్ అంటే చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి. అయితే తాజగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితురాలు డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ లైవ్‌టీవీలో డిబేట్ జరుగుతున్న సమయంలో కోపంతో ప్రతిపక్ష పార్టీ పీపీపీ(పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ) ఎంపీ ఖాదీర్‌ మండోఖేల్‌ చెంప పగలగొట్టారు. అయితే పంజాబ్‌ సీఎం ఉస్మాన్‌ బుజ్దార్‌కు స్పెషల్‌ అసిస్టెంట్‌గా డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు విషయం ఏమిటంటే.. ఫిర్దౌస్‌ ఆశిక్‌, ఖాదీర్‌ మండోఖేల్‌లు పాక్ లో జరుగుతున్న అవినీతిపై ఒక టీవీ చానల్ వారు పెట్టిన చర్చలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.. ”దమ్ముంటే మేం చేసిన అవినీతిని రుజువు చేయాలని” ఫిర్దౌస్‌.. ఖాదీర్‌ మండోఖేల్‌ కు సవాల్‌ విసిరారు. ఆమె మాటలు ఏమాత్రం లెక్కచేయని ఖాదీర్‌ ఇది ముమ్మాటికీ అవినీతి ప్రభుత్వమంటూ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు.

దీంతో ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిన ఫిర్దౌస్‌ ఖాదీర్‌ చొక్కా పట్టుకొని కోపంతో అతని చెంపమీద లాగి కొట్టారు. ఆమె చర్యకు ఒక్కసారిగా హవాక్కయ్యారు ఖాదీర్‌. అయితే ఇదంతా కెమెరా ఎదుటే జరగడంతో అసలు విషయం బయట పడింది. తాజాగా ఆ వీడియో బయటకు రావడంతో ఈ విషయం వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై ఫిర్దౌస్‌ ఇంతవరకు స్పందించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here