Aswini: బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి గ్రాండ్ ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసినటువంటి రచ్చ ఆయన మెడకే చుట్టుకుంది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహం కనబరిస్తూ ర్యాలీలు చేయడం ఇతరుల కారులపై దాడి చేయడం గవర్నమెంట్ బస్సుల అద్దాలు పగలగొట్టడం వంటివి చేయటంతో ఏకంగా పల్లవి ప్రశాంతను పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు.

ఇలా అభిమానులు అత్యుత్సాహం కనబరుస్తూ ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ పై పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే బోలె ఏకంగా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే..అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ కి లా అండ్ ఆర్డర్ కూడా ఏమీ తెలియదు.
గెలిచాను అన్న సంతోషంతో ఆయన ర్యాలీ చేశారని, ఆయన ఎంతో జెన్యూన్ పర్సన్ కానీ అభిమానులు చేసిన పనికి తనని అరెస్టు చేయడం సరైంది కాదని చెప్పారు. ఈ క్రమంలోని అశ్విని కూడా ఈ ఘటన పై స్పందించారు పల్లవి ప్రశాంత్ అరెస్టు అయిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది అంటూ ఈమె ఈ అరెస్టు విషయంపై స్పందించారు.
ప్రశాంత్ కు మద్దతుగా అశ్విని..
పల్లవి ప్రశాంత్ కు ఇలాంటివన్నీ పెద్దగా తెలియదు తను చాలా మంచివాడు, తనని అరెస్టు చేశారని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారని దయచేసి మా తమ్ముడిని బయటకు తీసుకురండి అంటూ ఈమె కూడా పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించారు.అయితే అదే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు అశ్విని కారుపై కూడా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈమె పల్లవి ప్రశాంత్ కు మద్దతుగా నిలిచారు.




























