Pallonji Mistry : షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మెన్ పద్మభూషణ్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత… సంతాపం ప్రకటించిన పలువురు ప్రముఖులు…

0
365

Pallonji Mistry : పల్లోంజీ మిస్త్రీ భారతదేశానికి చెందిన ఒక అంతర్జాజీయ వ్యాపారవేత్త. 2016లో భారత ప్రభుత్వము వ్యాపారంలో ఈయన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారంతో ఈయనను సత్కరించింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం 93 సంవత్సరాల పల్లోంజీ సోమవారం రాత్రి ముంబై లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

పల్లోంజీ గుజరాత్ లోని పార్సి కుటుంబంలో జన్మించారు. 156 ఏళ్ళ క్రితం ముంబాయి లో స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలను అభివృద్ధి పరచడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ 18 కంపెనీలతో ఏర్పడిన ఒక పెద్ద ప్రపంచ వ్యాపార సంస్థగా వుంది. అంతేకాకుండా 14.7 బిలియన్‌ డాలర్లతో 2015 ఫోర్బ్స్‌ జాబితాలో ఈయన అయిదో స్థానం దక్కించుకున్నాడు. 2012 ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం పల్లోంజీ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన (రూ.53,000 కోట్లకు పైగా) ఐరిష్‌ వ్యక్తిగా కీర్తించబడ్డాడు. టాటా సన్స్‌లో 18.5 శాతంతో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారులుగా వున్నారు. పల్లోంజీ కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు షాపూర్ ప్రస్తుతం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలను చూసుకుంటున్నాడు. చిన్నకుమారుడు సైరస్ మిస్త్రీ 2012-16 మధ్య టాటా సన్స్ ఛైర్మెన్ గా పనిచేశారు. ఇక ఈయన కుమార్తెలు లైలా మిస్త్రీ, ఆలు మిస్త్రీ.

1865 లో స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థ వ్యాపారాలు రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ నిర్మాణం, వాటర్, ఎనర్జీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైన రంగాలలో భారత్‌, పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో విస్తరించాయి. తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌, ద ఒబెరాయ్‌ హోటల్స్‌ ఈ రెండింటినీ నిర్మించింది ఎస్‌పీజీ గ్రూపే కావడం విశేషం. ఇంకా ఒమన్‌లో సుల్తాన్‌ ప్యాలెస్‌, ఘనాలో అధ్యక్ష భవనాలు కూడా ఈ సంస్థే నిర్మించింది. ఇది కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో సచివాలయం భవనం, పోలీస్ కమాండర్ కంట్రోల్ భవనాలు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్మాణాలు జరుగుతుందటం విశేషం. ఇంతటి వ్యాపారం దిగ్గజం మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేసారు.