17 ఏళ్ళ కెరీర్ లో స్టార్ హీరో ప్రభాస్ వద్దు అని వదిలేసినా టాప్ 10 సినిమాలు ఇవే..!

0
213

కొంతమంది బడా హీరోలు వారి కెరీర్ లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసి ఉంటారు. అలా రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోను పెట్టి చేసిన తర్వాత ఆ సినిమా భారీ హిట్ పొందిన సినిమాలు అనేకం. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ప్రతి ఒక్క హీరో తను నటించకుండా వదిలేసిన సినిమాలు ఎన్నో. అలా వారి కెరీర్లో చాలా సూపర్ హిట్ సినిమాలను వదిలేసుకున్న వారు ఎందరో.

ఈ లిస్టులో టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ గా పేరు పొందిన ప్రభాస్ మొదట్లో చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆ తర్వాత చిన్న చిన్నగా మీడియం రేంజ్ హీరో స్థాయిని చేరుకొని ఆ తర్వాత ఎవరికి అందనంత ఎత్తుకు చేరిపోయాడు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ పేరు సంపాదించుకున్నాడు. తన 17 సంవత్సరాల సినీ జీవితంలో అతను చేసింది కేవలం 19 సినిమాలు మాత్రమే. ప్రస్తుతం హీరో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు యంగ్ రెబల్ స్టార్. ఇకపోతే హీరో ప్రభాస్ తన సినీ కెరీర్లో రిజెక్ట్ చేసిన సినిమాలు లిస్టు కూడా బాగానే ఉందండోయ్. ప్రభాస్ ఏంటి.. సినిమాలు రిజెక్ట్ చేయడం ఏంటి.. అని అనుకుంటున్నారు కదా అవునండి బాబోయ్ హీరో ప్రభాస్ ఏకంగా పది సినిమాల వరకు రిజెక్ట్ చేశారు అంటే నమ్ముతారా.. మరి హీరో ప్రభాస్ ఏ సినిమాలను తాను చేయని తప్పుకున్నాడో వాటిపై లుక్ వెళ్దామా..

ఈ లిస్టు లో మొదటగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబుకు భారీ విజయం అందించిన ఒక్కడు సినిమా గురించి. ఈ సినిమా మొదట్లో ప్రభాస్ దగ్గరికి వెళ్లగా ఇందుకుగాను ప్రభాస్, కృష్ణంరాజులు కథ విషయంలో కాస్త రిస్క్ చేయడం ఎందుకని భావించి రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత హీరో నితిన్ లైఫ్ లో ఓ మలుపు ఇచ్చిన సినిమా దిల్. ఈ సినిమా కూడా మొదట ప్రభాస్ ని సంప్రదించగా ఆ సమయంలో హీరో ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్టుని వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా కూడా ప్రభాస్ కి ముందుగా వివరించారట. అయితే సింహాద్రి సినిమా కంటే ముందు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 క్లాస్ సినిమాను తెరకెక్కించిన కారణంగా ఆ తర్వాత ఇంత సబ్జెక్టును ఎలా హ్యాండిల్ చేయగలడో లేదో అని భావించి ప్రభాస్ రిజెక్ట్ చేశారట.

వీటి తర్వాత అల్లు అర్జున్ కెరియర్ ను ఓ గాడిలో పెట్టిన సినిమాగా వినిపించే సినిమా పేరు ఆర్య. ఈ సినిమా కథను కూడా ముందుగా సుకుమార్, దిల్ రాజు ప్రభాస్ కి వినిపించారట. అయితే కారణమేమిటో తెలియదు కానీ ఆ సినిమాను కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఈ కథను సుకుమార్ ప్రభాస్ కంటే ముందుగా అల్లరి నరేష్ కు కూడా వినిపించాడట. అయితే ఆయన కూడా రిజక్ట్ చేయడంతో చివరికి కథలో కొన్ని మార్పులతో అల్లు అర్జున్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోయిన్లతో నటించిన ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా బృందావనం. ఈ సినిమా కథ కూడా ముందుగా హీరో ప్రభాస్ ని చేరగా ఆ సమయంలో ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమాను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ కెరియర్ లో రిజెక్ట్ చేసిన మరో సినిమా నాయక్. ఈ కథను వి.వి.వినాయక్ ముందుగా ప్రభాస్ ను పెట్టి తీయాలని అనుకోగా ఆ సమయంలో హీరో ప్రభాస్ రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆ సినిమాని పవన్ కళ్యాణ్ కు కూడా వినిపించిన ఆయన కూడా రిజెక్ట్ చేశారట.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ స్టామినాను తెలియజేసిన సినిమా కిక్. ఈ సినిమా కూడా మొదటగా డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్లిందట. అయితే ఏమైందో తెలియదు కానీ, ప్రభాస్ ఆ సినిమాపై డిసైడ్ చేసుకునే లోపే రవితేజను ఫిక్స్ చేసి సినిమాను సూరి రవి తేజ నిర్మించాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా సరిగా ఆడకపోయినా కథాంశం ప్రకారం మంచి మర్క్స్ పొందిన ఈ సినిమాను కూడా హీరో ప్రభాస్ రిజెక్ట్ చేసాడు. ఆ తర్వాత మరిన్ని మాస్ ఎలిమెంట్స్ జోడించి హీరో ఎన్టీఆర్ చేశారు. ఇక ఈ లిస్ట్ లో హీరో ప్రభాస్ రిజెక్ట్ చేసిన మరో సినిమా డాన్ శీను. నిజానికి ఈ సినిమా కథ గోపీచంద్ మలినేని మొదటగా ప్రభాస్ ను దృష్టిలో ఉంచుకొని రెడీ చేశారట. అయితే ఆ సమయంలో బుజ్జిగాడు సినిమాలో హీరో ప్రభాస్ చేసిన క్యారెక్టర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ కథను రెడీ చేశాడట. అయితే ఇది వరకు చేసిన క్యారెక్టర్ ను మళ్లీ చేయడానికి ఇష్టపడని ప్రభాస్ ఆ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడట. అందుకే ఆ సినిమాను చివరికి రవితేజ చేయాల్సి వచ్చింది. ఇక చివరిగా హీరో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమా జిల్. తన దగ్గరి స్నేహితుడైన గోపీచంద్ నటించిన ఈ సినిమాను కూడా ముందుగా డైరెక్టర్ ప్రభాస్ దగ్గరికి తీసుకువెళ్లగా దానిని ప్రభాస్ రిజెక్ట్ చేశాడు. దీనికి కారణం ఆ సమయంలో హీరో ప్రభాస్ బాహుబలి సినిమాలో బిజీగా ఉండడమే. ఆ కథకి గోపీచంద్ ను హీరోగా తీసుకోవాలని డైరెక్టర్ కు హీరో ప్రభాస్ రెకమెండ్ చేశారు. ఇలా హీరో ప్రభాస్ తన సినీ కెరీర్లో సినిమాలను రిజెక్ట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here