రేపటి నుండి 14వ తారీఖు వరకు 32 పార్సిల్ రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. కాకినాడ నుంచి సికింద్రాబాద్, రేణిగుంట నుంచి సికింద్రాబాద్, 34 పార్సిల్ రైళ్లను నడపనున్నట్టు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లను నిత్యవసరాల సరఫరా కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈనెల 8వ తేది నుండి 12వ తేదీ వరకు రేణిగుంట – నిజాముద్దీన్ కు 2 ప్రత్యేక పార్సిల్ రైళ్లు, 9న సికింద్రాబాద్ – హోరాకు ఒక పార్సిల్ ఎక్సప్రెస్ మరియు హైదరాబాద్ నుండి అమృత్సర్ కు 10వ తేదీన ఒక పార్సిల్ రైలు, రేణిగుంట – సికింద్రాబాద్ కు డైలీ పార్సిల్ రైలును దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.

దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించగానే దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 14 నుంచి రైళ్లను తిరిగి ప్రారంభిస్తారా లేదా అని దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. అయితే దీనిపై 12వ తారీఖున క్లారిటీ రానుంది. అయితే ఇదే గనుక జరిగితే మళ్ళీ జనాలు ఊర్లకు వెళ్లడం మొదలు పెడతారు. మల్లి గుంపులు గుంపులుగా ప్రయాణాలు మొదలైతే కరోనా మల్లి ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పట్లో రైళ్లు నడిచే అవకాశం కనిపించడం లేదు. దీనిపై రైల్వే శాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.




























