ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్స్ అంటే అదో పెద్ద వింతలానే చూసేవాళ్ళు.. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ప్రస్తుత సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. మన తెలుగు సినిమాల్లోనూ రెగ్యులర్ గా చుంబనం చేస్తున్నారు హీరో హీరోయిన్లు. ఇక బాలీవుడ్‌లో ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు లిప్ లాక్ లేని సినిమా లేదంటే నమ్మండి. అలాగని సినిమాల్లో కిస్సింగ్ సీన్స్ చేయడం అంట తేలికైన పనేం కాదు. అటువంటి సీన్స్ కేవలం నటనలో భాగంగానే చేయాలనే సూత్రాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాల్సిందే..

తాజగా లిప్ లాక్ చిత్రీకరణ పై బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సీన్స్ కూడా సాధారణంగానే ఉంటుంది. అయితే చుంబన సీన్స్ మాత్రం చిత్రీకరణ సమయంలో కట్ చెప్పగానే అయిపొయింది అంతే. అది తప్పితే ఏ నటీనటులకు వేరే ఫీలింగ్ కలగదు. అదంతా కేవలం సినిమా కోసం మాత్రమె చేస్తాం. ఆ తర్వాత అటువంటి ఫీలింగ్స్ ఉండవు’ అంటూ పరిణీతి చోప్రా చెప్పుకొచ్చింది.
































