Paritala Omkar : పరిటాల ఓంకార్.. ప్రముఖ రచయితగానే కాకుండా వెండితెర, బుల్లితెర మీద నటుడుగా, దర్శకుడిగా కూడా అభిమానులలో స్థానం సంపాదించుకున్నాడు. మొదట రేడియోలో వార్తలు చదవడంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఓంకార్. స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో ఒక శీర్షిక అలాగే సినిమా వార్తల విభాగం కూడా ఓంకార్ నిర్వహించేవారు. పరిటాల ఓంకార్ రాసిన రచనలలో అల్ ఇన్ వన్ బాగా ప్రజాదరణ పొందింది.

సమాజంలోని తప్పులను చూపడంతో అయనపై దాడులు…
కులాలు, రిజర్వేషన్ల నేపథ్యంలో ఆయన ‘ఈ చదువులు మాకొద్దు’ అనే సినిమాను కూడా నిర్మించడం జరిగింది. అయితే సినిమాను కొంతమంది రాజకీయ నాయకులు ఖండించి సినిమాను ఎవరూ చూడకుండా థియేటర్లలోనే నిలిపివేయించారు. అంతేకాకుండా ‘పోలీసు భార్య’ సినిమా లో రాసిన డైలాగు కొన్ని కులాలను కించపరిచేలా ఉన్నాయి అని కొన్ని కులాల వాళ్ళు అయనపై దాడులు చేసి అయనపై కేసులు కూడా పెడతామని బెదిరించారు.

ఇలాంటి ఆదర్శ భావాలు గల రచయిత విలక్షణ నటుడు 47ఏళ్ళ అతి చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఈయన వారసుడు బుల్లితెర మీద అదరగొడుతున్నాడు. ఈయన మరెవరో కాదు కార్తీక దీపం సీరియల్ తో అభిమానులకు ఎంతో దగ్గర అయిన మన డాక్టర్ బాబు. డాక్టర్ బాబు అసలు పేరు నిరుపమ్ పరిటాల. నిరుపమ్ కు సీరియల్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే.



























