Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ 1 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. దేవర సినిమా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సినిమా కాదని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ సినిమాకు ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రఫీ రత్నవేలును. ఈ సినిమాలో, సముద్రపు షాట్స్, షార్క్ ఫైట్ ఇవన్నీ ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక మ్యూజిక్ అనిరుథ్ బాగుంది కానీ ఎన్టీఆర్ కి తగినట్టు అనిపించలేదు. సినిమా బాగున్న బాగలేదని టాక్ వచ్చిన మిక్స్డ్ టాక్ వచ్చిన ఆ సినిమాని ముందుకు నడిపించాలి అంటే చాలా కష్టం కానీ ఎన్టీఆర్ ఈ సినిమాని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించారు.
సముద్రపు దొంగల కథ….
క్లుప్తంగా సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక సముద్రపు దొంగల కథ. ఒక దొంగ మంచివాడుగా మారిన తర్వాత ఏం జరిగింది..? తన తండ్రి కోసం ఒక కొడుకు ఏం చేశాడు అనేది కథ. ఆ కథ మీద ఆధారపడి కొరటాల ఏకంగా మూడు గంటల పాటు సినిమాని లాగించారు అంటే నిజంగా గొప్ప విషయం అని తెలిపారు.సముద్రంలో అలాంటి సీన్స్ చూపించడం అంటే ఈజీ కాదు. కొరటాల శివ మాత్రం స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించాడనీ దేవర సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.




























