“అదే జరిగి ఉంటె ఇప్పుడు సౌందర్య మన మధ్యనే ఉండేది…” ఆమె మరణం వెనుక రహస్యం చెప్పిన పరుచూరి!

0
489

తెలుగునాట హీరోయిన్ సౌందర్య గురించి తెలియని వారుండరు. సినిమాల్లోకి వచ్చిన కొద్దిరోజులకే తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులలో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సౌందర్య అంటే మన ఇంట్లో అమ్మాయి అనుకునేంతగా ప్రేక్షకుల మనస్సులో ఆమె నాటుకుపోయారు. తెలుగు చిత్ర సీమలో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు సౌందర్య. గొప్ప నటిగా ఎదుగుతున్న క్రమంలో ఆమె హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. తాజగా సౌందర్య గొప్పతనం గురించి పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ఇటీవలే పరుచూరి పలుకులు పేరుతొ అయన య్యుట్యూబ్లో ఒక ఛానల్ పెట్టిన విషయం తెలిసిందే… ఈ కార్యక్రమంలో అయన సౌందర్య గురించి మాట్లాడారు. వెంకీ మామ చిత్రం గురించి మాట్లాడుతూ “చాలా రోజులుగా “పరుచూరి పలుకులు” లో చాలా విషయాలు మీ అందరికతో పంచుకుంటున్నా.. అయ్యో నేను ఇంకా సౌందర్య గురించి చెప్పలేదా అనే భావన నాలో కలిగింది. మా టీమ్ ఈ విషయం మా టీమ్ నాకు ఎందుకు గుర్తు చేయలేదో కూడా నాకు తెలియదు… సౌందర్యతో నేను కేవలం 8 సినిమాలు మాత్రమే చేసాము.. ఆమె 100కు పైగా చిత్రాలలో నటించింది.” అంటూ మొదలు పెట్టిన పరుచూరి గోపాల కృష్ణ.

సౌందర్య అంటే కదిలే అందం.. సౌంద్యర్య మనస్సు అంటే ఒక నిండు కుండా లాంటి గొప్ప వ్యక్తిత్వం.. సావిత్రి గారిని చూసినపుడు ఎలాంటి అరుదైన ఫీలింగ్ కలుగుతుందో… అలంటి అరుదైన ఫీలింగ్ కలిగే మరో ఏకైక హీరోయిన్ సౌంద్యర్య.. ” ఇలాంటి భార్య ఉంటె బాగుండు అనే ఫీలింగ్ కంటే ఇలాంటి చెల్లెలు ఉంటె బాగుండు.. ఇలాంటి కూతురు ఉంటె బాగుండు అనిపించే ఫీలింగ్ రావడం చాలా అరుదు” అన్నారు. 1993 లో చాలా చిన్న పిల్లగా “ఇన్స్పెక్టర్ ఝాన్సీ” చిత్రంలో నటించింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు సౌంద్యర్య వినయం, విజ్ఞత, తన విధేయత, పెద్దవాళ్ళ పట్ల ఆమె చూపించే గౌరవం ఇవన్నీ గమనించి సౌందర్య అప్పుడే పెద్ద స్టార్ అవుతుంది అనుకున్నాం. ఆ తరువాత కోడిరామ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమాలో అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఆ తరువాత సౌందర్యతో ఆజాద్ చిత్రంలో పనిచేశాం.. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఆమె స్టార్ ఇమేజి పెరుగుతుంది కానీ.. అందరిపట్ల ఆమె చూపించే వినయం, గౌరవంలో కొంచెం కూడా మార్పులేదు. స్టార్ హీరోయిన్ అనే గర్వం కొంచెం కూడా లేదు.

“ఆజాద్” ఓ “జయం మనదేరా” సినిమా సమయంలోనో సరిగా గుర్తులేదు కానీ ఒకసారి ఆమె వచ్చి చాలా ఆసక్తి కరమైన విషయం చెప్పింది. మా నాన్నగారు కూడా మీలాగే సినిమా రచయిత అని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. నాలాంటి రచయితా కూతురు ఇంత అద్భుతమైన మహానటిగా ఎదుగుతోంది అనే నిజం చాలా సంతృప్తినిచ్చింది. ఇప్పటికి చాలా సినిమాల్లో, చాలా పాత్రలు ఆమె నటించి ఉంటె బాగుండేది అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సౌందర్య ఒక అభూతమైన నటి “ఇంట్లో ఇల్లాలు”, “అమ్మోరు”, “దొంగాట” ఆ పాత్రలు చూసేకొద్దీ చూడాలని అనిపిస్తుంటుంది అని పరుచూరి అన్నారు.

ఏప్రిల్ 17, 2004 నా జీవితంలో మరిచిపోలేని రోజు….

ఏప్రిల్ 17, 2004 సాహిత్యంలో నేను డాక్టరేట్ తీసుకునే రోజు.. నా తల్లి కోరిక తీర్చబోతున్న తరుణం.. ఇంటికి వెళ్లి ఇదిగో అమ్మ నీకొడుకు పేరుముందు డాక్టర్ వుంది అని చూపించాలని ఆనందపడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చుని ఉన్న సమయంలో ఒక విలేఖరి వచ్చి “సార్… Sad న్యూస్… అని అనగానే నాకు అర్ధం కాలేదు.. నేను ఇంత మధురమైన క్షణాలకోసం ఎదురుచూస్తుంటే ఇతను ఏమి sad న్యూస్ చెప్పబోతున్నాడు నాకు అనుకుని ఏంటి అని అడిగాను.. హెలికాఫ్టర్ క్రాష్ అండి అన్నాడు. నాకు ఒళ్ళంతా జల్లు మంది. ఆ సమయంలో ఎలెక్షన్స్ క్యాంపైన్ జరుగుతుంది. అందరు హెలీకాఫ్టర్లలో తిరుగుతూన్నారు. ఎవరు అని అన్నాడు. సౌందర్య అండి అని ఆటను బదులిచ్చాడు”. నేను పుత్రికా వాత్సల్యంతో చూసే అమ్మాయి… నా తల్లి కోరుకునే క్షణాలు అందుకునే సమయంలో… ఆ అమ్మాయి ఇక లేదు అంటే నా మనస్సు పడిన బాధ అంత ఇంత కాదు…

సౌందర్య మరణం గురించి…

అసలు సౌందర్య ఆ సమయంలో విమానంలో రావాల్సివుంది.. ఆప్తమ్రిత (తెలుగు లో నాగవల్లి) సినిమా షూటింగ్ కారణంగా ఆమె ఫ్లైట్ మిస్ అయింది. అందుకే హెలికాఫ్టర్ లో బయలుదేరింది. అదే సౌందర్య విమానంలో వచ్చి ఉంటె మనం ఒక అద్భుతమైన మహా నటిని దూరం అయ్యే వాళ్ళము కాదు. ఆమె లేని లోటు నిజంగా పూడ్చలేనిది అంటూ అభిప్రాయ పడ్డారు పరుచూరి గోపాలకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here