చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలెం రాజు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ప్రార్థనా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకునే మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో హిందూ, మహిళా సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి.

ఒక మల్లెపూల వ్యాపారి చర్చ్ ముందు దుకాణం పెట్టాడట. కానీ అక్కడ మహిళలు మల్లెపూలు కొనడం తగ్గిపోయిందని గమనించిన పాస్టర్, అతనికి “ఇక్కడ ఎవ్వరూ బజారు మహిళలు కావు.. పరిశుద్ధ ఆత్మ గలవాళ్లు మాత్రమే ఉన్నారు” అన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన హిందూ మహిళలను తక్కువ చేసి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. హిందూ సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి, ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ‘సంతోషి సేవా పరిషత్’ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
పాస్టర్ షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య కాగా, వడ్డెర కులానికి చెందిన ఆయన పూర్వంలో కూలీపనులు చేసేవారని సమాచారం. ఇప్పుడు క్రైస్తవ ప్రచారం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడి చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మల్లెపూలు పెటు కునే హిందూ మహిళాలని ,చులకన గా కించపర్చిన ,నీచంగా మాట్లాడిన పాస్టర్ షాలెం రాజు ని సుమోటో గా కేసు కట్టి లోపల వేయాలి..ఎటువంటి అనుమతులు లేక చర్చి నడుపుతు, మతమార్పిడులు చేస్తున్నాడు.#ArrestSalemRaju@Palnadu_Police @NCWIndia pic.twitter.com/Z39qPRM8Xs
— Mohan Vamsi🚩 (@IamMohanVamsi) June 12, 2025































